అవగాహన కల్పిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు
ఆసిఫాబాద్ రూరల్, మే 21: మండలంలోని పాడిబండ గ్రామ పంచాయతీలో శనివారం పౌష్టికాహా రంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాగిజావా, రాగిలడ్డు, సామలతో పాయసం, ఇతర వస్తువులతో పౌష్టికాహారం ఎలా తయారు చేయాలో వివరించారు. వీటిని 0-6 సంవత్సరాల పిల్లలు, గర్భిణులు, బాలింతలు తింటే రక్తహీనత కానీ, పిల్లల బరువు తగ్గడం లాంటివి జరగకుండా కాపాడగలుతా మన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దినకర్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ సుజాత, పీబీఏ కుమారస్వామి, కార్యదర్శి ప్రసాద్ బాబు, కారోబార్ కైలాస్, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.