గోడపత్రాలు అతికించి అవగాహన

ABN , First Publish Date - 2021-03-07T04:39:52+05:30 IST

పులిని రక్షించడం అందరి బాధ్యతని మండలంలోని తాం సి(కె), గొళ్లఘాట్‌, అర్లి(టి), ఇందూర్‌పల్లి తదితర గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు గోడపత్రాలను అతికించి గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

గోడపత్రాలు అతికించి అవగాహన

భీంపూర్‌, మార్చి6: పులిని రక్షించడం అందరి బాధ్యతని మండలంలోని తాం సి(కె), గొళ్లఘాట్‌, అర్లి(టి), ఇందూర్‌పల్లి తదితర గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు గోడపత్రాలను అతికించి గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ పులి సంచరిస్తుందని, దానికి ఎటువంటి హాని చేయరాదన్నారు. పశువుల కాపర్లు పులి సంచరిస్తున్న ప్రాంతం వైపు వెళ్లొద్దన్నారు. పులి అడుగులు కనిపిస్తే తెలియజేయాలని, ఎవరైనా హాని కలిగిస్తే వైల్డ్‌ లైఫ్‌ ప్రొటక్షన్‌ యాక్ట్‌ 1972 ప్రకారం శిక్షించనున్నామని తెలిపారు. 

Updated Date - 2021-03-07T04:39:52+05:30 IST