జునోసిస్‌ వ్యాధులపై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2022-07-07T05:09:24+05:30 IST

జునోసిస్‌ దినోత్సవాన్ని బుధ వారం పలు ప్రాంతాల్లో నిర్వ హించారు. టెక్కలి, మందస మండలం హరిపురం, బేతాళ పురం, పాతపట్నం, కోటబొమ్మాళి, కవిటి, రణస్థలం తదితర ప్రాంతాల్లోని ప్రాంతీయ, పశువైద్య ఆసుపత్రుల్లో కుక్కలకు వ్యాక్సిన్‌ వేశారు.

జునోసిస్‌ వ్యాధులపై అవగాహన అవసరం
కోటబొమ్మాళి: కుక్కలకు టీకాల ప్రక్రియను పర్యవేక్షిస్తున్న డీడీ డాక్టర్‌ జయరాజ్‌

టెక్కలి/హరిపురం/పాతపట్నం/కోటబొమ్మాళి/కవిటి/రణస్థలం: జునోసిస్‌ దినోత్సవాన్ని బుధ వారం పలు ప్రాంతాల్లో నిర్వ హించారు. టెక్కలి, మందస మండలం హరిపురం, బేతాళ పురం, పాతపట్నం, కోటబొమ్మాళి, కవిటి, రణస్థలం తదితర ప్రాంతాల్లోని ప్రాంతీయ, పశువైద్య ఆసుపత్రుల్లో కుక్కలకు వ్యాక్సిన్‌ వేశారు. పశు సంవర్థక శాఖాధికారులు డా.జయరాజ్‌, జి.రఘునాథ్‌, మంచు కరుణాకరరావు, బి.దుర్గారావు, మంద లోకనాథం పర్యవేక్షణలో వైద్యాధికారులు దువ్వాడ శ్రీకాంత్‌, కిల్లి ఉమాభారతి, పి.అనిల్‌, హరీష్‌, ఎల్‌.కిరణ్‌కుమార్‌ వివిధ జాతుల కుక్కలకు వ్యాక్సిన్‌ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జునోసిస్‌ వ్యాధులైన రాబిస్‌, ఆంత్రాక్స్‌, ఎబోలా, బర్డ్స్‌ ఫ్లూ, బ్రూసెల్లోసిస్‌, సాల్మొనెల్లోసిస్‌ వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ పెంపుడు జంతువుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో సిబ్బంది పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-07-07T05:09:24+05:30 IST