ఈవీఎంలపై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2021-10-24T05:04:01+05:30 IST

ఉప ఎన్నికల సిబ్బంది ఈవీఎంలపై పూర్తి అవగాహన కలిగి, సజావుగా నిర్వహించి విజయవంతం చేయాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ పేర్కొన్నారు.

ఈవీఎంలపై అవగాహన అవసరం
సిబ్బందికి సూచనలు ఇస్తున్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కేతన్‌గార్గ్‌

బద్వేలు,అక్టోబరు23: ఉప ఎన్నికల సిబ్బంది ఈవీఎంలపై పూర్తి అవగాహన కలిగి, సజావుగా నిర్వహించి విజయవంతం చేయాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ పేర్కొన్నారు. శనివారం జిల్లా పరిషత్‌ బాలుర ఉన్న త పాఠశాలలో ఆయన సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. పోలింగ్‌ రోజున ఈవీఎంల లో సమస్యలు ఉత్పన్నమైతే వెంట నే సంబంధిత సెక్టరోల్‌ అధికారికి సమాచా రం ఇవ్వాలని,  పోలింగ్‌రోజున  మాక్‌పోల్‌ నిర్వహించాలన్నారు. ఈవీఎంల ఆపరేటింగ్‌ పై వీడియోలను పంపుతామని వాటిని జా గ్రత్తగా పరిశీలించాలన్నారు. ముందురోజే పోలింగ్‌  సిబ్బంది కేంద్రానికి వెళ్లాల్సి ఉం టుందన్నారు. కార్యక్రమంలో పోలింగ్‌ సిబ్బం ది, అధికారులు పాల్గొన్నారు.

అట్లూరులో... ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా నియోగించుకోవాలని తహసీల్దార్‌ ఇందిర రాణీ అన్నారు. వరికుంట పో లింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన ఆమె మాట్లాడుతూ 30న జరగనున్న ఉప ఎన్నికల్లో పూ ర్తి స్థాయిలో ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఓటర్లకు దీనిపై అవగాహన కల్పిస్తామన్నారు. ఆది వారం ఉదయం 10 గంటలకు కుంభగిరి, మధ్యాహ్నం గుజ్జులవారిపల్లిలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  ఏఎ్‌సఎ ప్రసున్న, సినీయర్‌ అసిస్టెంట్‌ సుధాకర్‌రెడ్డి, మండల సర్వే రు సుధాకర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కాశినాయనలో... మిద్దెల, నర్సాపురం గ్రా మాల్లో ఈవీఎం, వీవీప్యాడ్‌లపై అవగాహన సదస్సులు నిర్వహించినట్లు నోడల్‌ అధికారి అశోక్‌ తెలిపారు. ఓ టు వేసే విధానం, నిర్ధారణ విషయాలను ప్రజలకు వివరించారు. ఆదివారం ఉదయం ఉప్పలూరు. సాయంత్రం ఓబుళాపురంలో సదస్సులు ఉంటాయన్నారు. కార్యక్రమంలో వీఆర్వో చెండ్రాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T05:04:01+05:30 IST