అగ్ని ప్రమాదాలపై అవగాహన

ABN , First Publish Date - 2021-04-18T06:30:50+05:30 IST

అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా శుక్రవారం పట్టణంలోని మాత ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో విద్యార్థులకు అగ్నిప్రమాదాలపై అగ్నిమాపక అధికారి విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది అవగాహన కల్పించారు.

అగ్ని ప్రమాదాలపై అవగాహన

మడకశిర అర్బన, ఏప్రిల్‌ 17: అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా శుక్రవారం పట్టణంలోని మాత ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో విద్యార్థులకు అగ్నిప్రమాదాలపై అగ్నిమాపక అధికారి విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది అవగాహన కల్పించారు. తోటలు, పెద్దపెద్ద భవంతులు, దుకాణాలు, వ్యాపార సంస్థల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటే తక్షణం చేపట్టాల్సిన నివారణ చర్యలు, మంటలను అదుపుచేసి ఆస్తులు, ప్రాణాపాయాల నుంచి ఎలా కాపాడుకోవాలనే దానిపై విన్యాసాల ద్వారా అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఎంఆర్‌ కోదండపాణి, మంజునాథ్‌, తిరుపాల్‌, గంగాద్రి, శ్రీనివాసులు, హరి,తేజ, గంగాధర్‌,ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు.

పెనుకొండ టౌన: అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు భయాందోళనకు చెందకుండా అప్రమత్తంగా ఉండాలని ఇనచార్జ్‌ ఫైర్‌ ఎస్‌ఐ రంగనాథ్‌ పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక ప్రగతి గ్లోబుల్‌జెన పాఠశాలలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విపత్తు జరిగినప్పుడు ఏవిధంగా అగ్నిమాపక సిబ్బంది ఎదుర్కొంటారో చూపించారు. 



Updated Date - 2021-04-18T06:30:50+05:30 IST