గృహ హక్కు పథకంపై అవగాహన కల్పించాలి: జేసీ

ABN , First Publish Date - 2021-11-28T05:56:34+05:30 IST

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) ఎంకెవీ శ్రీనివాసులు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.

గృహ హక్కు పథకంపై అవగాహన కల్పించాలి: జేసీ

నంద్యాల, నవంబరు 27: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) ఎంకెవీ శ్రీనివాసులు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శనివారం నంద్యాల పట్టణంలోని 1, 37వ వార్డు సచివాలయాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డుల వారీగా అన్ని ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఇప్పటి వరకు గుర్తించిన వారు ఎంతమంది, పరిశీలన, సర్వే, డేటా ఎంట్రీ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 1వ వార్డులోని నలుగురికి, 37వ వార్డులోని 13 మందికి  రుణ విముక్తి పత్రాలను పంపిణీ చేశారు. జేసీ వెంట ఇన్‌చార్జి ఆర్డీవో మల్లికార్జునుడు, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటకృష్ణ, తహసీల్దార్‌ రవికుమార్‌, హౌసింగ్‌ డీఈ సత్యరాజ్‌, కౌన్సిలర్లు, వార్డు సచివాలయాల అడ్మిన్‌లు ఉన్నారు. 


Updated Date - 2021-11-28T05:56:34+05:30 IST