క్రియా విశ్వవిద్యాలయంలో రుతుక్రమ సమస్యలపై అవగాహన

ABN , First Publish Date - 2022-06-04T00:43:40+05:30 IST

శ్రీసిటీ క్యాంపస్‌లోని క్రియా విశ్వవిద్యాలయం రుతుక్రమ సమస్యలపై అవగాహన పెంచేందుకు ఔట్రీచ్ కార్యక్రమాన్ని

క్రియా విశ్వవిద్యాలయంలో రుతుక్రమ సమస్యలపై అవగాహన

తిరుపతి: శ్రీసిటీ క్యాంపస్‌లోని క్రియా విశ్వవిద్యాలయం రుతుక్రమ సమస్యలపై అవగాహన పెంచేందుకు ఔట్రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మహిళలకు చెన్నైకి చెందిన గోహైజీన్ ఫౌండేషన్ వ్యక్తిగత పరిశుభ్రత కిట్‌లను అందించింది. కావేరి హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ సులోచన క్రిస్టోఫర్ క్రియా యూనివర్సిటీలో 45 మందికి పైగా మహిళా సపోర్టు సిబ్బందికి రుతుక్రమ సమస్యలకు సంబంధించిన అపోహలతో సహా అన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయక సిబ్బంది లేవనెత్తిన సందేహాలను డాక్టర్ సులోచన నివృత్తి చేశారు.  


అనంతరం డాక్టర్ సులోచన మాట్లాడుతూ.. రుతుక్రమ సమయంలో యువతులు ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఎలా ఉండాలో వివరించారు. అలాగే, పోషకాహారం తీసుకోవాల్సిన ప్రాధాన్యతను వివరించారు. డీన్ ఆఫ్ స్టూడెంట్స్ విద్యా మునుస్వామి మాట్లాడుతూ.. తమ సిబ్బంది ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.  

Updated Date - 2022-06-04T00:43:40+05:30 IST