నూతన సాగు పద్ధతులపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-01-22T03:55:30+05:30 IST

రైతులకు లాభదాయకమైన సరికొత్త పద్ధతులపై అవగా హన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌ సుధాకర్‌ అన్నారు.

నూతన సాగు పద్ధతులపై అవగాహన కల్పించాలి
ఏఈవోల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌ సుధాకర్‌

నర్వ, జనవరి 21 : రైతులకు లాభదాయకమైన సరికొత్త పద్ధతులపై అవగా హన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌ సుధాకర్‌ అన్నారు. గురు వారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో ఏఈవోలతో సమావేశమై ఆయన మాట్లాడుతూ మండలంలో త్వరితగతిన క్రాప్‌బుకింగ్‌ ప్రక్రియను పూర్థి చేయా లని ఆదేశించారు. ఏఈవోలు గ్రామాల్లోని రైతుల వద్దకు వెల్లి కొత్తరకాల పంట లపై అవగాహన కల్పించాలని సూచించారు. సమాజంలో రైతులపై ఆధార పడి వ్యాపారాలు కొనసాగించే వారే అధికంగా ఉంటారని తెలిపారు. రైతులు లాభదా యకమైన పంటలు వేసుకునేలా సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా పీవోఎస్‌ పరికరాలపై ఎరువుల దుకాణ దారులకు, ఏడీఏ అవగా హన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఎ దైవగ్లోరి, ఏవో గనేష్‌రెడ్డి, ఏఈవోలు మహేశ్‌, వెంకట్రాములు, వెంకటేశ్‌, శ్వేత, కతలప్ప, ప్రవీణ్‌, తార పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T03:55:30+05:30 IST