దార్ల రవి చెక్కిన ఓటు హక్కు చిత్రం
నక్కపల్లి, జనవరి 24 : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటు హక్కుపై యువతకు అవగాహన కల్పించేందుకు సూక్ష్మ కళాకారుడు దార్ల రవి శనివారం అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించాడు. మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన ఈ కళాకారుడు సందర్భానుసారం తనలోని కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటాడు. తాజాగా చెక్కపై ఓటు హక్కు చిత్రాన్ని చెక్కి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.