మాట్లాడుతున్న టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్
ఆసిఫాబాద్ రూరల్, జూన్ 25: క్షయవ్యాధిపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులు సకాలంలో మం దులు వేసుకునే విధంగా చూడాలన్నారు. సమావే శంలో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు సుధాకర్‌నాయక్, సీతారాం, ప్రోగ్రాంఆఫీసర్ సునీల్‌రావు,డాక్టర్ ప్రేంసా గర్, మెడికల్‌ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.