ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కార్యక్రమం

Published: Sun, 29 May 2022 01:00:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కార్యక్రమంబంక్‌ కూడలిలో నార సంచులతో అవగాహన కల్పిస్తున్న జడ్‌సీ చక్రవర్తి

గోపాలపట్నం, మే 28: ప్లాస్టిక్‌ వినియోగం విడనాడి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్సీ చక్రవర్తి పిలుపునిచ్చారు. జూన్‌ 5 నుంచి ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధం విధించనున్న నేపఽథ్యంలో స్థానిక బంక్‌ కూడలిలో అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్సీ చక్రవర్తి మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ వినియోగం విడనాడాలని పిలుపునిచ్చారు. ఈ సంరద్భంగా దుకాణదారులకు కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ వెన్నల అప్పారావు, ప్రజారోగ్య విభాగం సిబ్బంది జగ్గునాయుడు, ప్రసాద్‌, సన్యాసిరావు, దమ్ము శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.