యాంత్రీకరణపై జిల్లాస్థాయిలో అవగాహన సదస్సులు

ABN , First Publish Date - 2020-11-27T05:50:28+05:30 IST

సాగులో యం త్రాల ఉపయోగం, ఖర్చు తగ్గించుకోవడం, దిగుబడి పెం చుకోవడంపై రైతులకు జిల్లాస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు.

యాంత్రీకరణపై జిల్లాస్థాయిలో అవగాహన సదస్సులు
ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌

నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 26: సాగులో యం త్రాల ఉపయోగం, ఖర్చు తగ్గించుకోవడం, దిగుబడి పెం చుకోవడంపై రైతులకు జిల్లాస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. గురువారం తన చాంబర్‌లో వ్యవసాయ అధికారులు, కంపెనీ ప్రతినిధులు, శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమాల ఏర్పాటు, చేపట్టవలసిన చర్యలపై ఆయన స మీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ము ఖ్యమైన వ్యవసాయ పనులు నిర్వహించుకునే సమయం లో రైతులకు నాట్లువేయడం, కలుపు తీయడం, పంటలు కోయడం తదితర విషయాల్లో కూలీల సమస్య, ఇతర సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారని, దానిని నివారించడానికి యాంత్రీకరణ ఎంతైనా అవసరం ఉందన్నారు. ఈ పనులకు సంబంధించిన యంత్రాలను తయారుచేసిన కంపెనీల ప్రతినిధులను యంత్రాలు రప్పించి వాటి పనితీరుపై రైతులకు జిల్లాస్థాయిలో పెద్దఎత్తున అవగాహన కా ర్యక్రమాలు వచ్చే నెలలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యంత్రాల ఉపయోగం వల్ల సమాన లైన్‌లలో నాట్లు వేయడం ద్వారా పంట దిగుబడి కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని మున్ముందు వ్యవసాయ పనులకు కూలీల కొరతను దృష్టిలో పెట్టుకొని పెరిగిన కూలీ రేట్ల బదులుగా అంతకంటే తక్కువ ఖర్చులో యంత్రాలతో వ్యవసాయ పనులు చేసుకోవడం ద్వారా రై తులకు సమయం, కూలీ ఖర్చులు ఆదా కావడంతో పాటు అధిక దిగుబడి వస్తుందన్నారు. ఈ యంత్రాల కొనుగోలు కు  బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.యంత్రీకరణతో పాటు రైతు లకు వ్యవసాయ శాస్త్రవేత్తలచేత పంట దిగుబడి పెంచుకోవడానికి నాణ్యమైన పంటను సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, రసాయన ఎరువుల వాడకం తదితర అంశాలను నేరుగా రైతులకు వివరించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌, వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్‌ బాలాజీనాయక్‌, డాక్టర్‌ నవీన్‌, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

మన రాజ్యాంగం మనకెంతో గర్వకారణం

స్వాతంత్య్రం అనంతరం భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా తయారుచేయడానికి ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, చర్చించి, శోధించి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని, మన రాజ్యాంగం మనకెంతో గర్వకారణంతో పాటు ఇతర దేశాలకు దిక్సూచి లాంటిదని కలెక్టర్‌ సి.నారయణరెడ్డి అన్నారు. గురువారం భారత రాజ్యాంగం ఆమోదించిన రోజును పురస్కరించుకొని కలెక్టర్‌ ప్రగతిభవన్‌లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ పరిరక్షణపై కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎన్నో కులాలు, మతాలు, వర్గాలను వారి జీవన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పగా నిలిచిందన్నారు. దేశంలోని తరతమ బేధాలు లేకుండా పౌరులందరికి సమాన హక్కులు కల్పించిందన్నారు. 1949 నవంబరు 26న ఈ రాజ్యాంగాన్ని ఆమోదించారని దీని వల్ల మనకు ఎన్నో హక్కులు కల్పించబడ్డాయన్నారు. ఈ రాజ్యాంగం పట్ల మనమందరం గౌరవంగా ఉండవలసిన అవసరం ఉందని, ప్రతీ సంవత్సరం ఈ రోజును ఘనంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర సమన్వయకర్త శైలి బెల్లాల్‌, జిల్లా గిరిజన సంక్షేమ అఽధికారిణి సంధ్యారాణి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2020-11-27T05:50:28+05:30 IST