సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , First Publish Date - 2022-08-11T05:30:00+05:30 IST

సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవాలి

సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవాలి
సైబర్‌ నేరాలపై రూపొందించిన హ్యాండ్‌ బుక్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ కోటిరెడ్డి

  • సైబర్‌ కాంగ్రెస్‌ గ్రాండ్‌ ఫినాలేలో కలెక్టర్‌ నిఖిల
  • ఎంపికైన విద్యార్థులను సైబర్‌ వారియర్స్‌గా తీర్చిదిద్దాం : ఎస్పీ 

వికారాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : సైబర్‌ నేరాలను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ అవ గాహన పెంపొందించుకోవాల్సిన అవ సరం ఎంతైనా ఉంద ని కలెక్టర్‌ నిఖిల అన్నారు. గురువారం నర్సింగ్‌ గౌలీకార్‌ ఫంక్షన్‌హాల్‌లో ఉమెన్‌ సేఫ్టీవింగ్‌, తెలంగాణ పోలీస్‌, విద్యా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్‌ కాంగ్రెస్‌ గ్రాండ్‌ ఫినాలే కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో దొంగలు ఇళ్లలో చొరబడి ధనం దోచుకుని వెళ్లేవారని, ప్రస్తుతం మోసగాళ్లు సైబర్‌ నేరాల ద్వారా ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారని చెప్పారు. సైబర్‌ నేరాలపై శిక్షణ పొందిన విద్యార్థులు ఎవరూ కూడా సైబర్‌ నేరాల బారినపడి మోసపోకుండా తమ సహచర విద్యార్థులకు, తమ కాలనీవాసులు, ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ సైబర్‌ సేఫ్టీ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సైబర్‌ కాంగ్రెస్‌ పేరిట గత సంవత్సరం నుంచి విద్యార్థులకు శిక్షణ ఇస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో సైబర్‌ నేరాలను ఏ విధంగా నియంత్రించవచ్చని, సైబర్‌ నేరాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. సైబర్‌ వారియర్లు తమ  గ్రామస్తులకు, మిత్రులకు అవగాహన కల్పించి సైబర్‌ నేరాల బరినపడకుండా అప్రమత్తం చేయాలని కోరారు. అదనపు ఎస్పీ రషీద్‌, విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి రవికుమార్‌, జిల్లా సైన్స్‌ అఽధికారి విశ్వేశ్వర్‌, మహిళా పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రమీల, షీటీమ్‌ అధికారులు, యంగిస్థాన్‌ స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిఽధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్‌ నేరాలపై అవగాహన కోసం రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను వారు విడుదల చేశారు. సైబర్‌ నేరాల శిక్షణ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్‌, ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు.

Updated Date - 2022-08-11T05:30:00+05:30 IST