AP NEWS: నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు అవగాహన

ABN , First Publish Date - 2022-09-26T01:15:47+05:30 IST

పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి ద్విచక్ర వాహనాలు నడిపిన యువకులకు వారి తల్లిదండ్రులకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

AP NEWS: నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు అవగాహన

విశాఖపట్నం(Visakhapatnam): పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి ద్విచక్ర వాహనాలు(TWO WHEELERS) నడిపిన యువకులకు, వారి తల్లిదండ్రులకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన(Awareness) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 500 మంది ద్విచక్రవాహనదారులకు సీపీ శ్రీకాంత్(CP Srikanth) అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ శ్రీకాంత్ మాట్లాడుతూ... ‘‘ఈ ఏడాది 250 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులు మరణించారు.27 మంది హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాద సమయంలో మృతిచెందారు.రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది.మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం,అజాగ్రత్తతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతున్నాయి.ద్విచక్రవాహనదారులు వాహనం నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలి. పోలీసుల కోసం హెల్మెట్ ధరించవద్దు మీ రక్షణ కోసం ధరించండి.నగర ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీస్ వారికి సహకరించాలి’’ అని సీపీ శ్రీకాంత్ తెలిపారు.

Updated Date - 2022-09-26T01:15:47+05:30 IST