ఆయుర్వేదంతో అనారోగ్యం దూరం

ABN , First Publish Date - 2021-11-25T06:42:01+05:30 IST

ఆయుర్వేదంతో అనారోగ్యం దూరం

ఆయుర్వేదంతో అనారోగ్యం దూరం
ఆయుర్వేద మందులను పంపిణీ చేస్తున్న గంగాభవాని, సాంబశివరాయల్‌

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, నవంబరు 24 : వ్యాధులు రాకుండా ఆరోగ్యకర జీవితాన్ని కొనసాగించడానికి, వ్యాధినిరోధకశక్తి పెంపొందించుకునేందుకు ఆయుర్వేదం మంచి మార్గమని, పౌష్టికాహారం, వ్యాయామంతో అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని విద్యార్ధులకు జడ్పీటీసీ సభ్యురాలు కొమరవల్లి గంగాభవాని సూచించారు. కానుమోలు ఎంపీపీ, సీఎ్‌సఐ స్కూల్‌  విద్యార్ధులకు వ్యాధినిరోధశక్తిని పెంచే ఆయుర్వేద లేహ్యాన్ని రాణా వెల్ఫేర్‌ సొసైటీ సహకారంతో బుధవారం ఆమె పంపిణీ చేశారు. సరైన పద్ధతిలో ఆహారం తీసుకోవడం, నిర్ణీత సమయంలో నిద్ర, తెల్లవారుఝామునే మేల్కొని వ్యాయామం చేయడం విద్యార్ధులందరూ తమ జీవన చర్యలలో భాగంగా చేసుకోవాలని రాణా వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు సుంకర సాంబశివరాయల్‌  తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం తయారు చేసే విధానాన్ని, పదార్ధాలను పరిశీలించి  సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఎనికేపల్లి సీతమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు కాటుమాల ఇంద్రజ, గ్రంథాలయాధికారి రహీం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-25T06:42:01+05:30 IST