పుల్ల తేనుపులు పోవాలంటే...

ABN , First Publish Date - 2022-05-04T18:32:03+05:30 IST

వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు లేదా సరైన ఆహారాన్ని తీసుకోనప్పుడూ గొంతులోకి గ్యాస్‌ ఎగదన్నుతుంది

పుల్ల తేనుపులు పోవాలంటే...

ఆంధ్రజ్యోతి(04-05-2022)

వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు లేదా సరైన ఆహారాన్ని తీసుకోనప్పుడూ గొంతులోకి గ్యాస్‌ ఎగదన్నుతుంది. పుల్లటి తేనుపులు వచ్చి గొంతులో మంట కూడా పుడుతుంది. కొందరికి అయితే ఈ తేనుపులు వారం రోజులు అయినా తగ్దవు. దీనికి ఆయర్వేదంలో ఒక మంచి చిట్కా ఉంది. 


ఆరోగ్యవంతమైన వేపచెట్టు బెరడును తీసుకొని దానిని మెత్తగా చూర్ణం చేసుకోవాలి. శొంఠి, మిరియాలను కూడా పొడి చేసుకోవాలి. ఇలా ఈ మూడు పొడులను పది గ్రాములు చొప్పున ఒక గ్లాసులో వేసుకొని ఉదయాన్నే పరగడుపున ఒక పెద్ద గ్లాసు నీళ్లలో కలుపుకొని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా ఒక నెల రోజులు తాగితే పుల్ల తేనుపులతో పాటుగా అజీర్తి, మలబద్ధకం కూడా తగ్గుతాయు. ఆకలి పెరుగుతుంది. ఇతర ఉదర సంబంధ వ్యాధులు కూడా తొలగిపోతాయి.

Read more