ఉశీరాసవం

ABN , First Publish Date - 2020-11-24T05:30:00+05:30 IST

శార్గధర సంహిత, భైషజ్య రత్నావళి, సహస్రయోగం మొదలైన ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలలో ఉశీరాసవం తయారీ విధానం, ఉపయోగాలు వివరించడం జరిగింది...

ఉశీరాసవం

శార్గధర సంహిత, భైషజ్య రత్నావళి, సహస్రయోగం మొదలైన ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలలో ఉశీరాసవం తయారీ విధానం, ఉపయోగాలు వివరించడం జరిగింది.

సంస్కృతంలో ఉశీర అంటే వట్టి వేళ్లు. దీని శాస్త్రీయ నామం వెటివేరియా జిజనియోడిస్‌. ఇది గడ్డి జాతికి చెందినది. దీని వేర్లు సన్నగా, గుబురుగా పెరుగుతాయి. ఉశీర ఔషధంలో వట్వి వేళ్లతో పాటు కురు వేరు, ఎర్ర తామర పువ్వులు, నల్ల కలువలు, అగరు సొంఠి, బూరుగు జిగురు వంటి 21 పై చిలుకు మూలికలు ఉంటాయి. ఈ మూలికల మిశ్రమంతో శాస్త్ర గ్రంధాలలో చెప్పినట్టుగా ఆసవ విధానంలో ఉశీరాసవ తయారుచేస్తారు. 


పలు వ్యాధులలో...

ఉశీరాసవం సేవిస్తే రక్త పిత్తము, పాండవు, కుష్ఠు, ప్రమేహము, మూలవ్యాధి, శోష నశిస్తాయి. నెలసరి అధిక రక్తస్రావం తగ్గడానికి పనిచేస్తుంది. పైత్య తత్వం కలిగిన స్త్రీలకు విశేషంగా పనిచేస్తుంది. శరీర వేడి తగ్గించడానికి, పొడి చర్మానికి దీన్ని వాడతారు. పసుపు రంగులో, పసుపు రంగుతో కూడిన మూత్రం మంటను తగ్గిస్తుంది. రక్తపైత్యం పెరగడం వల్ల వచ్చే కేన్సర్‌ వ్యాధి చికిత్సలో అనుపానంగా పనిచేస్తుంది. చిన్నపిల్లలు, మరీ ముఖ్యంగా ఆడపిల్లల్లో మూత్రం వేడిగా రావడం, మూత్రవిసర్జన సమయంలో మంట వంటి సమస్యలను తగ్గిస్తుంది. 


ఉపయోగించే మోతాదు: పెద్దలు 10 మిల్లీ లీటర్లు, పిల్లలు 5 మిల్లీ లీటర్లు ఉదయం, సాయంత్రం లేదా వైద్యుల సూచనమేరకు వాడుకోవాలి. ప్రస్తుతం ధూద్‌ పాపేశ్వర్‌, బైద్యనాద్‌, వైద్యరత్న, డాబర్‌ వంటి ఆయుర్వేద మందుల సంస్థలు ఉశీరాసవంను తయారుచేస్తున్నాయి.

- శశిధర్‌,

అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,

సనాతన జీవన్‌ ట్రస్ట్‌, కొత్తపేట, చీరాల.

Updated Date - 2020-11-24T05:30:00+05:30 IST