ఘనంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవం

ABN , First Publish Date - 2022-08-10T05:25:29+05:30 IST

పట్టణంలోని అరుణోదయ పబ్లిక్‌ స్కూల్‌లో ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబాలికలు దేశభక్తి గీతాలను ఆలపించారు.

ఘనంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవం
వై.పాలెం మినీగురుకులంలో విద్యార్థుల ప్రదర్శన

గిద్దలూరు, ఆగస్టు 9 : పట్టణంలోని అరుణోదయ పబ్లిక్‌ స్కూల్‌లో ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబాలికలు దేశభక్తి గీతాలను ఆలపించారు. స్వాతంత్య్ర సమరయోధులు దేశం కోసం పాటుబడిన తీరును గురించి నాటికలు వేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రామక్రిష్ణయ్య, ఎంఈవో వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ గడ్డం.భాస్కర్‌రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్‌ చంద్రశేఖర్‌, డైరెక్టర్‌ గురుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

పోస్టాఫీసులో జాతీయ జెండాల అమ్మకం

పట్టణంలోని హెడ్‌ పోస్టాఫీసులో జాతీయ జెండాలను అమ్మకానికి సిద్దంగా ఉంచారు. పోస్టాఫీసుకు 2వేల జెండాలను కేటాయించగా ఇప్పటికే 500 జెండాలకు పైగా అమ్ముడైనట్లు పోస్ట్‌మాస్టర్‌ ఎస్‌.రంగస్వామిరెడ్డి తెలిపారు. ఒక్కో జాతీయ జెండా రూ.25  చెల్లించి తీసుకోవచ్చన్నారు.

పొదిలి రూరల్‌ : బెల్లంకొండ కళాశాలల ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్‌ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. విద్యార్థులు త్రివర్ణ పతాకాలు చేతబట్టి బెల్లంకొండ కళాశాల క్యాంపస్‌ నుండి ఒంగోలు - కర్నూల్‌ ప్రధాన రహదారి వరకు రెండు కిలోమీటర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధినేత శ్రీనివాసరావు మాట్లాడుతూ  దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భం గా ప్రభుత్వ ఆజాదిగా అమృతోత్సవాలు నిర్వహిస్తోందన్నారు. అందులో భాగంగా ఆగస్టు 15 వరకు బిట్స్‌ కళాశాల ఆధ్వర్యంలో దేశభక్తి, దేశ సమైఖ్యతకు చెందిన వివిధ కార్యక్రమాలు నిర్వాహించనున్నట్లు పేర్కొన్నారు.  కార్యక్రమం లో కరస్పాండెంట్‌ విజయలక్ష్మీ, ప్రిన్సిపాల్‌ తోట శ్రీనివాసులు అధ్యాపకులు పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ ర్యాలీలో విద్యార్థులు పాల్గొని దేశభక్తిని పెంపొందించుకోవాలని ఎంపీడీవో సాయికుమార్‌ అన్నారు. ఎర్రగొండపాలెం మిని గురుకుల బాలికల పాఠశాల బాలికలతో  మంగళవారం ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ ర్యాలీ నిర్వహించారు. జాతీయ పతాకంతో ప్రదర్శనలు నిర్వహించారు. ఆగస్టు 13, 14, 15 తేదీలలో జాతీయపతాకం ప్రతి విద్యార్థి ఇంటిపై రెపరెపలాడాలన్నారు.  కార్యక్రమంలో ఎంఈవో పి ఆంజనేయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గంజివారిపల్లె గ్రామపంచాయతీ గాంధీనగర్‌ గిరిజనగూడెం పాఠశాల గిరిజన విద్యార్థులు సర్పంచి డి.సుబ్బారెడ్డి ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ ర్యాలీ నిర్వహించారు.

Updated Date - 2022-08-10T05:25:29+05:30 IST