అజరుద్దీన్‌కు బెదిరింపులు..!

Published: Fri, 28 Jan 2022 03:52:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అజరుద్దీన్‌కు బెదిరింపులు..!

పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): క్రికెట్‌ అసోసియేషన్‌నుంచి సస్పెండైన కొందరు సభ్యులు తనను బెదిరిస్తున్నారని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్‌ గురువారం బేగంపేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సస్పెండైన విజయానంద్‌, నరేష్‌ శర్మ జింఖానా గ్రౌండ్‌ లోని హెచ్‌సీఏ కార్యాలయ సిబ్బందిని సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయమై ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావును వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, న్యాయ సలహా తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.