Viral Video: వర్షం పడుతున్నా ఆగని బరాత్.. తడవకుండా ఉండేందుకు మాస్టర్ ప్లాన్..

ABN , First Publish Date - 2022-07-07T01:44:55+05:30 IST

వివాహ వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని అందరూ అనుకుంటారు.

Viral Video: వర్షం పడుతున్నా ఆగని బరాత్.. తడవకుండా ఉండేందుకు మాస్టర్ ప్లాన్..

వివాహ వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని అందరూ అనుకుంటారు. పెళ్లి కోసం ఎంత డబ్బులైనా వెచ్చించేందుకు వెనుకాడరు. బంధువులు, స్నేహితుల మధ్య వివాహానికి సంబంధించిన ప్రతి ఒక్కవేడుక ఎంతో గ్రాండ్‌గా చేసుకుంటారు. వర్షాకాలం మొదలు కావడంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు పెళ్లి వేడుకలకు అడ్డంకిగా మారుతున్నాయి. వర్షం పడుతుంటే అనుకున్న విధంగా పెళ్లి కార్యక్రమాలు జరగవు. 


తాజాగా Madhya Pradesh‌లోని  ఇండోర్‌లో జరిగిన ఒక పెళ్లి వేడుకకు వర్షం అడ్డంకిగా మారింది. పరదేశీపురా ప్రాంతంలో మంగళవారం సాయంత్రం పెళ్లి బరాత్ ప్రారంభమైంది. రోడ్డు మీద పెళ్లి కూతురు ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా వెళ్తోంది. ఆమె వాహనం వెనుక బంధువులు, స్నేహితులు వెళ్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా కుండపోతగా వర్షం ప్రారంభమైంది. అయినా పెళ్లి వారు ఆగలేదు. వెంటనే ప్రత్యేకమైన టార్పలిన్ కవర్‌ను అరెంజ్ చేశారు. టార్పలిన్ కవర్‌ను పట్టుకుని దాని కింద పెళ్లి వారు ఊరేగింపుగా వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.



Updated Date - 2022-07-07T01:44:55+05:30 IST