NRI మహిళ.. కన్న బిడ్డ కోసం బాబా చెప్పిన మాటలు నమ్మింది.. చివరికి ఆమె పరిస్థితి ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-07-20T21:28:42+05:30 IST

ఆమె ఎన్నారై మహిళ. కొన్నేళ్లుగా మలేషియాలో నివసిస్తోంది. కన్న కొడుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. ఇండియాకు తిరిగొచ్చింది. ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి విసుగొచ్చిందో లేక కన్న బిడ్డకు ఎలాగైనా నయం కావాలనుకుందో తెలియదు కానీ..

NRI మహిళ.. కన్న బిడ్డ కోసం బాబా చెప్పిన మాటలు నమ్మింది.. చివరికి ఆమె పరిస్థితి ఏమైందంటే..

ఎన్నారై డెస్క్: ఆమె ఎన్నారై మహిళ. కొన్నేళ్లుగా మలేషియాలో నివసిస్తోంది. కన్న కొడుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. ఇండియాకు తిరిగొచ్చింది. ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి విసుగొచ్చిందో లేక కన్న బిడ్డకు ఎలాగైనా నయం కావాలనుకుందో తెలియదు కానీ.. ఓ బాబాను సంప్రదించింది. అతడు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మింది. దీంతో.. చివరికి ఆమె పరిస్థితి ఎలా తయారైందనే వివరాల్లోకి వెళితే..


కర్మ్‌జిత్ కౌర్ (Karmjit Kaur) అనే సిక్కు మహిళ.. కొన్నాళ్లుగా తన కుటుంబంతో కలిసి మలేషియాలో నివసిస్తోంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఇటీవల అతడు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కుమారుడి పరిస్థితి చూసి ఆమె భయాందోళనలకు గురైంది. వెంటనే అతడిని తీసుకుని ఇండియాకు బయల్దేరింది. ఇక్కడ ఆసుప్రతుల చుట్టూ తిరిగింది. అయినా అతడి పరిస్థితి మెరుగు పడలేదు. దీంతో బంధువులు చెప్పిన మాటలు విని.. పంజాబ్‌లోని తార్న్ తారస్ సాహిబ్ పట్టణంలో గల ఓ బాబాను సంప్రదించింది. ఈ క్రమంలో సదరు బాబా.. ఆమెకు లేనిపోనివన్నీ చెప్పాడు. 



ముస్లిం మతంలోకి మారేందుకు మీ అబ్బాయి సిద్ధమవుతున్నాడంటూ Karmjit Kaur‌ను భయపెట్టాడు. అంతేకాకుండా చికిత్స కోసం రూ.2.50లక్షలు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇచ్చిన తర్వాతే చికిత్స ప్రారంభిస్తానని నమ్మబలికాడు. దీంతో ఆమె ఆ మొత్తాన్ని అతడికి ఇచ్చేసింది. తీరా డబ్బులు చేతికి అందిన తర్వాత సదరు బాబా చేతులెత్తేశాడు. దీంతో అతడు చేసిన మోసాన్ని గ్రహించిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బులు తీసుకుని చికిత్స చేయలేదని.. తానిచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వమంటే.. బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు.. విచారణ ప్రారంభించారు.  


Updated Date - 2022-07-20T21:28:42+05:30 IST