బాబా షర్పుద్దీన్‌ ఉరుసు ఉత్సవాలు రద్దు

ABN , First Publish Date - 2022-01-21T06:23:13+05:30 IST

మండల కేంద్రంలోని కుమ్మరపేటలో ఈ నెల 25 నుండి మూడు రోజుల పాటు నిర్వహించే బాబా షర్పొద్దీన్‌ ఉరుసు ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు ఉర్సు కమిటీ సభ్యులుతెలిపారు.

బాబా షర్పుద్దీన్‌ ఉరుసు ఉత్సవాలు రద్దు

తలుపుల, జనవరి 20: మండల కేంద్రంలోని కుమ్మరపేటలో ఈ నెల 25 నుండి మూడు రోజుల పాటు నిర్వహించే బాబా షర్పొద్దీన్‌ ఉరుసు ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు ఉర్సు కమిటీ సభ్యులు ఆమోదు మియా బాబ్‌జాన్‌, ఇలి యాజ్‌, గౌస్‌మోదీన్‌, ఖాజాపీర్‌ తెలిపారు.  కమిటీ సభ్యులు గురువారం తలుపులకు విచ్చేసిన డీఎస్పీను కలిసి ఉరుసు నిర్వహణకు అనుమతులు ఇవ్వాలని కోరారు.  దీనిపై డీఎస్పీ మాట్లాడు తూ కరోనా ఉధృతంతో ప్రభుత్వం రాత్రి 11.00 గంటల నుండి ఉదయం 5.00 గంటల వరకు కర్ఫ్యూ విధించిందన్నారు. ఉర్సు నిర్వహణకు అనుమ తులు ఇవ్వలేమన్నారు. సభ్యులు కోరిక మేరకు ఈ నెల 25వ తేదీన రాత్రి 11.00 గంటల లోపు కేవలం 50 మందితో గంధం నిర్వహించుకో వాల న్నారు. అటు తరువాత అక్కడ ప్రజలు కనిపిస్తే అరెస్ట్‌ చేస్తామని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మహమ్మద్‌ రఫీ, మాజీ స ర్పంచ్‌ ఫయాజ్‌ అహమ్మద్‌, మహమ్మద్‌ పీరా, గ్రామ పెద్దలు  పా ల్గొన్నారు.


Updated Date - 2022-01-21T06:23:13+05:30 IST