పసికందు వదిలివేత

ABN , First Publish Date - 2022-06-29T04:53:50+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో పసికందును వదిలి వెళ్లిన ఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 27న రాత్రి 10 గంటల సమయంలో అయిజ పట్టణ చౌరస్తా సమీపంలో ఓ మహిళ, ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని కొంతమంది వ్యక్తులు గమనించారు.

పసికందు వదిలివేత
అయిజ ఆస్పత్రిలో పసికందుతో అధికారులు

అయిజలో ఘటన

మహబూబ్‌నగర్‌ శిశువిహార్‌కు తరలింపు


అయిజ, జూన్‌ 28: జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో పసికందును వదిలి వెళ్లిన ఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 27న రాత్రి 10 గంటల సమయంలో అయిజ పట్టణ చౌరస్తా సమీపంలో ఓ మహిళ, ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని కొంతమంది వ్యక్తులు గమనించారు. మహిళ చేతిలో ఏడు నెలల పసికందు ఉండడంతో గమనించి వివరాలు అడిగారు. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేలోగానే వారు పాపను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఎస్‌ఐ నరేష్‌ పాపను స్వాధీనం చేసుకొని, ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఆ పాపను అంగన్‌వాడీ కేంద్రం ఆయాకు అప్పగించారు. మంగళవారం ఉదయం ఐసీడీఎస్‌ సీడీపీవో కమలాదేవి, ఎస్‌ఐ నరేష్‌లు పాపకు వైద్య పరీక్షలు చేయించి, మహబూబ్‌నగర్‌లోని శిశువిహార్‌ కేంద్రానికి తరలించారు.

Updated Date - 2022-06-29T04:53:50+05:30 IST