Baahubali is an elephant: మళ్లీ కున్నూరు రహదారిలో బాహుబలి ఏనుగు సంచారం

ABN , First Publish Date - 2022-08-10T16:33:03+05:30 IST

కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం సమీపంలోని కున్నూరు రహదారిలో మంగళవారం వేకువజామున బాహుబలి(Baahubali) ఏనుగు సంచరించడంతో

Baahubali is an elephant: మళ్లీ కున్నూరు రహదారిలో బాహుబలి ఏనుగు సంచారం

చెన్నై, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం సమీపంలోని కున్నూరు రహదారిలో మంగళవారం వేకువజామున బాహుబలి(Baahubali) ఏనుగు సంచరించడంతో ఆ మార్గంలో వెళుతున్న వాహనచోదకులు భీతిల్లారు. కొద్ది నెలలకు ముందు ఆ ఏనుగు జనావాస ప్రాంతాల్లో నానా బీభత్సం సృష్టించింది. ఆ తర్వాత ఆ ఏనుగు(Elephant) అడవిలోకి వెళ్ళిపోవటంతో స్థానికులు ఊరట చెందారు. ఈ నేపథ్యంలో మళ్ళీ బహుబలి ఏనుగు అడవి నుంచి బయటపడి కున్నూరు(Coonoor) రహదారిలో స్వేచ్ఛగా సంచరిస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు మేట్టుపాళయం - కున్నూరు రహదారిలో నిఘా వేస్తున్నారు.

Updated Date - 2022-08-10T16:33:03+05:30 IST