బాబూ జగ్జీవన్‌ రామ్‌ సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2022-07-07T05:20:38+05:30 IST

జనం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయమని డిప్యూటీ సీఎం, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్‌.బి.అంజాద్‌బాషా, టీడీపీ కడప ఇన్‌చార్జి అమీర్‌బాబు, దళిత నేతలు కొనియాడారు.

బాబూ జగ్జీవన్‌ రామ్‌ సేవలు చిరస్మరణీయం
జగ్జీవన్‌రామ్‌కు వివాళులర్పిస్తున్న డిప్యూటీ సీఎం, టీడీపీ నేతలు

నివాళులర్పించిన డిప్యూటీ సీఎం అంజాద్‌బాష

కడప టీడీపీ ఇన్‌చార్జి అమీర్‌బాబు, దళితనేతలు

జనం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయమని డిప్యూటీ సీఎం, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్‌.బి.అంజాద్‌బాషా, టీడీపీ కడప ఇన్‌చార్జి అమీర్‌బాబు, దళిత నేతలు కొనియాడారు. బాబు జగ్జీవన్‌రామ్‌ వర్థంతి సందర్భంగా కడప నగరం మహావీర సర్కిల్‌ వద్ద జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి ఘన నివాళులఅర్పించా రు. ఏపీ దళితనాడు సంఘం ఆధ్వర్యంలో జడ్పీ కార్యాలయం ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వివరాల్లోకెళితే....

కడప(ఎర్రముక్కపల్లి),  జూలై 6: డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ భారత దేశ ఉప్రధానిగా, పలు పదవులను చేపట్టా రన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి  కృషి చేసిన మహానేత బాబూ జగ్జీవన్‌రామ్‌ అన్నారు. కార్మిక చట్టాల్లో, వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, సోషల్‌ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పులి సునీల్‌, మాసీమబాబు,  స్థానిక కార్పొరేటర్లు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. 

టీడీపీ ఆధ్వర్యంలో....

 దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేసి, భారత ఉప ప్రధాని గా దేశానికి విశేష సేవలందించిన రాజనీతిజ్ఞుడు బాబూ జగ్జీవన్‌రామ్‌ అని టీడీపీ కడప నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ వీఎ్‌స అమీర్‌బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో కడప పార్లమెంట్‌ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు గన్నేపాటి మల్లేశ్‌, టీడీపీ నగర కార్యదర్శి జలతోటి జయకుమార్‌, నగర మైనార్టీ అధ్యక్షుడు షేక్‌ ఇమ్రాన్‌,  రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి సీఎ్‌స నాసర్‌అలీ, బీసీ నేత గంగాధర్‌, ప్రేమ్‌కుమార్‌, చాంద్‌బాష పాల్గొన్నారు.

జడ్పీ ఆవరణలో రక్తదాన శిబిరం

కడప మారుతీనగర్‌, జూలై6: బాబూ జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి సందర్భంగా జిల్లా పరిష త్‌ ప్రాంగణలో రక్తదాన శిబిరం నిర్వహిం చారు. ఏపీ దళితనాడు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటిగాండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరంలో జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి మాట్లాడా రు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ బాల య్య, జడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, ఎంఆర్‌పీఎస్‌ నేతలు ఆంజనేయులు, జివి రమణ, దళిత నేతలు స్వామినాధం, కె. సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.  

వేంపల్లెలో.....

వేంపల్లె, జూలై 6: జగజ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి దళితనేతలు నివాళులర్పించా రు. అంచలంచెలుగా ఎదిగి ఉన్నత పదవు లు పొందిన ఆయన దళితుల అభ్యున్నతికి కృషిచేశారని, దళితుల కోసం కృషిచేశారని విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు నాగన్న పేర్కొన్నారు.  దళితనేతలు రామాం జ నేయులు, కమతం రాజా, వెంకటసుబ్బ య్య, ఓబులేసు, శ్రీరాములు, శివయ్య, శ్రీను, గంగులయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T05:20:38+05:30 IST