ఇంటర్నెట్ డెస్క్: మనుషుల మధ్య అనుబంధాలు ఉంటాయి. మనం పెంచుకునే జంతువులతో కూడా ఆ బంధాల్ని కొనసాగిస్తాం. వాటిని ప్రేమగా చూసుకుంటాం. కొంత మంది తాము పెంచుకున్న కుక్క, పిల్లిని సొంత ఇంట్లో మనుషుల్లా చూసుకుంటారు. అవి కూడా యజమానులతో సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సామ్రాట్ గౌడ ట్విట్టర్లో గున్న ఏనుగు మావటితో ఆడుకుంటున్న వీడియో పోస్ట్ చేశారు. కంచెకు ఉన్న ఇనుప రాడ్డును చాకచక్యంగా తొలగించిన గున్న ఏనుగు బయటకు వచ్చి నేరుగా పరుపుపై పడుకున్న మావటి దగ్గరకు వెళ్లింది. అది తన బెడ్ అని చెప్తూ.. ఆ పరుపుపై నుంచి మావటిని లేపే ప్రయత్నం చేస్తుంది. మావటి ఎంతకు లేవకపోవడంతో అతడిని పక్కకు నెట్టి ఆ బెడ్‌ను ఆక్రమించుకుంది. మావటి తిరిగి వచ్చి పడుకోవడంతో గున్న ఏనుగు అలక ప్రదర్శించింది. దీంతో మావటి ఏనుగుతో కలిసి పరుపుపై పడుకున్నాడు. ప్రస్తుతం మావటితో గున్న ఏనుగు చేసిన హంగామా నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇవి కూడా చదవండి