ఆప్ ఆఫీస్‌లో బేబీ కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-03-10T19:44:29+05:30 IST

రెండేళ్లక్రితం ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో అందరినీ ఆకర్షించాడో చిన్నారి. కేజ్రీవాల్‌లాంటి వేషధారణతో ఆకట్టుకున్న ఆ చిన్నారి బాలుడు తాజాగా ఆప్ కార్యాలయంలో కనిపించి సందడి చేశాడు.

ఆప్ ఆఫీస్‌లో బేబీ కేజ్రీవాల్

రెండేళ్లక్రితం ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో అందరినీ ఆకర్షించాడో చిన్నారి. కేజ్రీవాల్‌లాంటి వేషధారణతో ఆకట్టుకున్న ఆ చిన్నారి బాలుడు తాజాగా ఆప్ కార్యాలయంలో కనిపించి సందడి చేశాడు. అందరూ ముద్దుగా ‘బేబీ కేజ్రీవాల్’, ‘ద లిటిల్ మఫ్లర్‌మ్యాన్’ అని పిలిచే ఈ చిన్నారి ఇప్పుడు తలపాగా చుట్టుకుని, పంజాబ్ కాబోయే సీఎం భగవత్‌మన్‌లాగా తయారై ఆకట్టుకున్నాడు. పంజాబ్‌లో ఆప్ భారీ విజయం సాధించడంతో ఆప్ కార్యాలయంలో జరిగిన విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నారి బాలుడు ఆప్ ఆఫీస్‌కు వచ్చాడు. అక్కడ అందరి దృష్టినీ ఆకర్షించాడు. కాబోయే పంజాబ్ సీఎం భగవత్ మన్‌తోపాటు పలువురు ఆప్ నేతలు, బాలుడితో కరచాలనం చేసి ఫొటోలు దిగారు. ఆప్ కార్యాలయంలో బాలుడు ఉన్న ఫొటోలను ఆప్ సోషల్ మీడియా విభాగం రిలీజ్ చేసింది. మరోవైపు యూపీలో కూడా చిన్నారులు యోగి ఆదిత్యనాథ్ సింగ్ వేషధారణతో సంబరాల్లో పాల్గొంటున్నారు. అక్కడ బీజేపీ ఘన విజయం సాధించడంతో నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

Updated Date - 2022-03-10T19:44:29+05:30 IST