బేబీ పొటాటో, మటర్‌ డ్రై కర్రీ

ABN , First Publish Date - 2022-01-28T17:33:59+05:30 IST

బేబీ పొటాటో- 12, పచ్చి బఠానీ- ముప్పావు కప్పు, కారం- అర స్పూను, జీలకర్ర- స్పూను, పచ్చి మిర్చి ముక్కలు- అర స్పూను, చాట్‌ మసాలా పొడి- స్పూను, ఉప్పు, నూనె- తగినంత.

బేబీ పొటాటో, మటర్‌ డ్రై కర్రీ

కావలసిన పదార్థాలు: బేబీ పొటాటో- 12, పచ్చి బఠానీ- ముప్పావు కప్పు, కారం- అర స్పూను, జీలకర్ర- స్పూను, పచ్చి మిర్చి ముక్కలు- అర స్పూను, చాట్‌ మసాలా పొడి- స్పూను, ఉప్పు, నూనె- తగినంత.


తయారుచేసే విధానం: పాన్‌లో కాస్త నూనె వేసి కాగాక బేబీ ఆలు, పచ్చి బఠానీలు వేసి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించాలి. కారం కూడా వేసి కలిపాక ముప్పావు కప్పు నీళ్లు ఇందులో పోసి తక్కువ మంట మీద ఇరవై నిమిషాలు ఉడికించాలి. ఆలు, పచ్చి బఠానీలు ఉడికి, నీరంతా ఆవిరయ్యాక ఉప్పు, చాట్‌ మసాలా వేసి కలిపి స్టవ్‌ కట్టేస్తే కర్రీ రెడీ.

Updated Date - 2022-01-28T17:33:59+05:30 IST