బిడ్డా.. ఇది మా అడ్డా!

ABN , First Publish Date - 2022-04-23T07:10:47+05:30 IST

వృద్ధాప్యంలో అండ గా ఉంటారనుకున్న పిల్లలు.. వారిని

బిడ్డా.. ఇది మా అడ్డా!

  •  వృద్ధాప్యంలో ఆసరాగా నిలవని బిడ్డలు
  •  ఆస్తులు పంచాలంటూ కొట్లాట
  •  ఉన్న డబ్బు పేదలకు పంచి.. 
  • గుణపాఠం నేర్పిన తల్లిదండ్రులు


హనుమకొండ క్రైం, ఏప్రిల్‌ 22: వృద్ధాప్యంలో అండ గా ఉంటారనుకున్న పిల్లలు.. వారిని పొమ్మన్నారు!! ఆ స్తులను త్వరగా పంచిపెట్టాలంటూ మీదపడి కొట్టారు !! కన్నబిడ్డల కర్కశత్వాన్ని కళ్లారా చూసి.. క్షోభకు గు రైన ఆ వృద్ధ దంపతులు గుండెను రాయిగా చేసుకున్నారు. తమ బాగోగులను పట్టించుకోకుండా.. ఆస్తులపైనే ధ్యాస పెట్టిన పుత్రరత్నాలకు ఎలాగైనా గుణపా ఠం నేర్పాలని వాళ్లు భావించారు. ఉన్న డబ్బును, మిగిలిన ఆస్తులనూ అమ్మేసి.. తమలాంటి నిరుపేద వృద్ధులకు ఆర్థిక సాయం చేయాలనే సంచలన నిర్ణయాన్ని హనుమకొండ హనుమాన్‌నగర్‌కు చెందిన సముద్రాల ఐలయ్య(63) భాగ్యల్యక్ష్మి (62) దంపతులు తీసుకున్నా రు.


‘60ఏళ్లకు పైబడిన నిరుపేద వృద్ధులకు ఆర్థికసా యం’ అంటూ శుక్రవారం తమ ఇంటి ఎదుట ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీన్ని చూసి.. వాళ్ల ఇంటి వద్దకు వం దలాదిగా వృద్ధులు తరలివచ్చారు. దాదాపు 400 మం దికి తలో రూ.500 ఇచ్చారు. ఇకపై తమ వద్ద డబ్బు సమకూరినప్పుడల్లా పేదలకు పంచేస్తామని ప్రకటించారు. కష్టార్జితాన్నే పంచుతున్నామని, తమకు ఉన్న రెండు ఇళ్లను అమ్మేసి వచ్చే డబ్బులను కూడా పంచుతామని తెలిపారు.


‘‘మా బాగోగులు చూడకుండా.. ఆస్తుల కోసం ఇబ్బందిపెడుతున్న పిల్లలు ఇక అక్కర్లే దు అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. కష్టప డి కూడబెట్టిన ఆస్తులను పిల్లలకు ఇవ్వబోం’’ అని స ముద్రాల ఐలయ్య చెప్పారు. తమ పేరిట ఉన్న రెండు ఇళ్ల విలువ రూ.2 కోట్ల దాకా ఉంటుందని, మరో రూ. 40 లక్షల నగదును అప్పుల రూపంలో తిప్పుతున్నామ ని ఆయన వివరించారు. ‘‘మా కష్టం పగవారికి కూడా రాకూడదు. పిల్లల నిరాదరణకు గురయ్యే వారు ఎవరై నా మమ్మల్ని సంప్రదిస్తే సహాయాన్ని అందిస్తాం..మా ప్రాణం ఉన్నంత వరకు ఇలా డబ్బులు పంచుతాం. లే దంటే అనాథాశ్రమాలకు ఆస్తులు రాసిచ్చి ఇద్దరం విషం తాగి చస్తాం’’ అని ఐలయ్య, భాగ్యలక్ష్మి దంపతులు భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. 



అడ్డా కూలీ నుంచి బిల్డర్‌ స్థాయికి.. 

హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం భీం పెల్లికి చెందిన ఐలయ్య, భాగ్యలక్ష్మి దంపతులు 1988 లో హనుమకొండకు వలస వచ్చారు.  హనుమాన్‌నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని జీవనం మొదలుపెట్టారు. ఐలయ్య తొలుత అడ్డా కూలీగా పనిచేసేవాడు. భాగ్యలక్ష్మి కుండలను అమ్మేది. కొద్దిరోజుల తర్వాత ఐలయ్య తాపీ మేస్త్రీగా ఎదిగాడు. కాలక్రమంలో.. బిల్డర్‌ అవతారం ఎత్తాడు. కాలం కలిసిరావడంతో ఆర్థికంగా స్థిరపడ్డాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. బిడ్డలకు పెళ్లిళ్లు చేశారు. కొడు కు మెడికల్‌ ల్యాబ్‌ నిర్వహిస్తూ వేరేచోట ఇల్లు కట్టుకొని జీవిస్తున్నాడు.


ఆ ఘటనతో క్షోభకు గురై.. 

కొద్దిరోజుల క్రితం భాగ్యలక్ష్మి నడుము నొప్పితో బా ధపడుతూ మంచానికే పరిమితమైంది. ఆమెను చూ సేందుకు కూతుళ్లు, కుమారుడు ఎవరూ రాలేదు. ఈ క్రమంలో వారు తమ బాగోగులు చూడాలంటూ కొడు కు, బిడ్డలను ఆశ్రయించారు. అయితే వారు ‘కాదు’.. పొమ్మన్నారు. అంతేకాకుండా.. ఇళ్లు, ఆస్తులు, భూము లు, డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగారు. ఒకదశలో భౌతికంగా దాడులకూ దిగారు. దీంతో కొడుకు, కూతుళ్లపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ కంటే ఆస్తులే ముఖ్యమని భావిస్తున్న పిల్లలకు.. ఆ ఆస్తులను ఇచ్చేది లేదని భీష్మించారు. పేదలకు సాయం చేస్తున్నారు. 


Updated Date - 2022-04-23T07:10:47+05:30 IST