నవంబరు నుంచి గ్రామదర్శిని

ABN , First Publish Date - 2020-10-25T09:59:19+05:30 IST

నియోజకవర్గంలో నవంబరు నుంచి గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిం చనున్నట్టు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు చెప్పారు.

నవంబరు నుంచి గ్రామదర్శిని

 గన్నవరం, అక్టోబరు 24 : నియోజకవర్గంలో నవంబరు నుంచి గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిం చనున్నట్టు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు చెప్పారు. గ్రామాల్లో పార్టీ కేడర్‌తోపాటు ప్రజలతో మమేకం అయ్యేం దుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిటనట్టు తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సోమ వారం శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. నాలుగు మండలాల్లోని పార్టీ గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొవాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు.


రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకాన్ని దూరం చేసేందుకే మీటర్లను పెడుతున్నారన్నారు. ఇటీవల వచ్చిన భారీ వర్షాలకు పంటలు నీటమునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ముఖ్యమంత్రి నేటి వరకు ఎక్కడా క్షేత్రస్థాయిలో ముంపునకు గురైన పంటలను పరిశీలించిన దాఖలాలు లేకపోవడం శోచనీయమన్నారు. ఇంత వరకు పంట నష్టాన్ని అంచనా వేసేందుకు చర్యలు కూడా చేపట్టలేదని తెలిపారు. పంట నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండు చేశారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోడపాటి రవి, పార్టీ జిల్లా నాయకుడు దొంతు చిన్న, బొడ్డపాటి రాంబాబు తెలుగుయువత నాయకులు మండవ అన్వేష్‌, బడుగు కార్తీక్‌ పాల్గొన్నారు. 


 అందరికీ అందుబాటులో ఉంటా

నియోజకవర్గంలో టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి  బచ్చుల అర్జునుడు అన్నారు. మండలంలోని పురుషోత్తపట్నం లో శనివారం పర్యటించారు. కొమ్మినేని రాజా నివాసంలో పార్టీ నాయకులతో  పరిచయ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు గన్నవరం వచ్చానని తెలిపారు.  ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. టీడీపీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ప్రణాళిక బద్దంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టన్నుట్టు తెలిపారు. టీడీపీ జిల్లా నాయకుడు దొంతు చిన్న, మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోడపాటి రవి, పురుషోత్తపట్నం అధ్యక్షుడు జాస్తి అమరయ్య, ప్రధాన కార్యదర్శి మోపాటి కోటేశ్వరరావు, నాయకులు కొమ్మినేని సీతారామయ్య, జూపల్లి సురేష్‌, గుత్తికొండ కొండలరావు,  తెలుగు యువత నాయకులు మండవ అన్వేష్‌, బడుగు కార్తీక్‌, కొమ్మినేని సుధీర్‌, గంపా శ్రీనివాస్‌ యాదవ్‌, పలగాని శ్రీనివాసరావు, రాంబాబు పాల్గొన్నారు.


ప్రభాకరరావు కుటుంబానికి పరామర్శ

పురుషోత్తపట్నంలో ఇటీవల మృతి చెందిన పార్టీ సీని యర్‌ నాయకుడు పోతురాజు ప్రభాకరరావు కుటుం బాన్ని పరామర్శించారు. అతని కుమారుడు సురేష్‌ ను ఓదార్చారు. పార్టీ సీనియర్‌ నాయకుడిని కోల్పోయిం దని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Updated Date - 2020-10-25T09:59:19+05:30 IST