టీడీపీలో వెన్నుపోటుదారులు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలి

ABN , First Publish Date - 2022-09-23T06:02:04+05:30 IST

పార్టీలో ఉంటూ ప్రత్యర్ధులతో అంటకాగుతున్న నాయ కులు స్వచ్ఛందంగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని టీడీపీ మార్కాపురం ఇన్‌చార్జ్‌ కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు.

టీడీపీలో వెన్నుపోటుదారులు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలి
మాట్లాడుతున్న కందుల నారాయణరెడ్డి

పొదిలి రూరల్‌ సెప్టెంబరు 22 : పార్టీలో ఉంటూ ప్రత్యర్ధులతో అంటకాగుతున్న నాయ కులు స్వచ్ఛందంగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని టీడీపీ మార్కాపురం ఇన్‌చార్జ్‌  కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. గురు వారం టీడీపీ రాష్ట్ర లీగల్‌సెల్‌ సెక్రెటరీగా ఎన్నికైన ఎస్‌ఎం భాష అభినందన కార్య క్రమంలో పాల్గొని మాట్లాడుతూ.., వెన్నుపోటు దారులు పార్టీలో ఉంటూ వ్యతిరేక చర్యలకు పాల్పడితే సహించబోమన్నారు. పార్టీలో కష్ట పడి పనిచేసే ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడు అండ గా ఉంటామని భరోసా ఇచ్చారు. అధిష్ఠానం దృష్టిలో పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల సమాచారం సేకరిస్తుందన్నారు. గతంలో మా దిరి టీడీపీ అని చెప్పుకొని ఇతరపార్టీ వాళ్లతో కుమ్మకైన వారికి టీడీపీలో  తావు లేదన్నారు. ఇక నుండి అలాంటి వారికి సహించేది లేదన్నారు. ప్రజాఉద్యమాలకు కార్యకర్తలు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొంత  మంది నాయకులు వ్యవహరిస్తున్న తీరు పార్టీకి తీరని నష్టం కలిగిస్తోందన్నారు. ఇప్పటికైనా అ లాంటి నాయకులు, కార్యకర్తలు ఉంటే  నిర భ్యంతరంగా బైటకు వెళ్లిపోవచ్చన్నారు. అలాంటి వారు పోయినందు వలన పార్టీకి ఎలాంటి లోటు ఉండదన్నారు. వారి స్థానంలో మరొకరిని పార్టీ తయారు చేసుకుంటుందని హితవు పలికారు. వ్యవహరశైలి మార్చుకొని పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. అక్రమ కేసులతో టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వేధింపు లకు గురవుతున్న కార్యకర్తలకు లీగల్‌సెల్‌ అండగా నిలవాలని కోరారు. రాష్ట్ర లీగల్‌సెల్‌ సెక్రెటరీ, ఎస్‌ఎం భాష పార్టీ అభివృద్ధికి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కీలక పదవి వచ్చినందుకు ఆయన సంతోషం వ్యకం చేశారు. అనంతరం లీగల్‌సెల్‌ సెక్రెట రీగా తనను నియమించేందుకు కృషి చేసిన కందుల నారాయణ రెడ్డి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మీగడ ఓబులరెడ్డి, పట్టణాధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్‌, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కాటూరి పెదబాబు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు డాక్టర్‌ ఇమాంమ్‌సా, మాజీ సర్పంచ్‌ కాటూరి చినబాబు, మాజీ శివాలయం చైర్మన్‌ సామంత పూడి నాగేశ్వరరావు, ఎస్సీసెల్‌ నాయకులు ఠాగూర్‌, జిల్లా నాయకులు పొల్లా నరసింహా రావు, మండల ప్రధాన కార్యదర్శి కాటూరి శ్రీను, టిడిపి నాయకులు మామిళ్లపల్లి వెంకటేశ్వర్లు, షాహీద్‌, మౌళాలి, మస్తాన్‌వలి, మేడా సుబ్బా రావు, ఎస్‌ఎంకె ఖశిం, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-23T06:02:04+05:30 IST