నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ "మా దర్శకుడు బాలాజీ శర వేగంతో, కంప్లీట్ క్లారిటీతో షూటింగ్ చేస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టుకుంటున్నారు" అని వివరించారు. హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ "ఈ చిత్రంలో నా పాత్ర పేరు అంజలి. వయసులో నాకంటే చిన్న వయసున్న అబ్బాయి ప్రేమ కోసం పరితపించే పాత్ర చేస్తున్నాను. చాలా ఛాలెంజింగ్ రోల్. బాలాజీ గారు నా పాత్రతోపాటు సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు" అని అన్నారు.