సుప్రీంకోర్టులో జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2021-12-18T02:35:13+05:30 IST

సుప్రీంకోర్టులో జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. దేవాల‌యాల్లో

సుప్రీంకోర్టులో జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఎదురుదెబ్బ

ఢిల్లీ: సుప్రీంకోర్టులో జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. దేవాల‌యాల్లో హిందూయేత‌రుల‌కు షాపుల కేటాయింపుపై సుప్రీం తీర్పును జ‌గ‌న్ స‌ర్కార్‌ అమ‌లు చేయ‌లేదు. దీంతో ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిష‌న్ దాఖ‌లు అయింది. సుప్రీం తీర్పును వెంట‌నే అమ‌లు చేయాల‌ని ధర్మాసనం ఆదేశించింది. మ‌తం ఆధారంగా దేవాల‌యాల్లో షాపుల లీజుల కేటాయింపు త‌గ‌దని సుప్రీంకోర్టు  స్పష్టం చేసింది. షాపుల వేలం పాట‌లో అన్నిమతాల వారు పాల్గొన‌వ‌చ్చని సుప్రీం తీర్పు ఇచ్చింది. అన్యమ‌తస్థుల‌కు హిందూ దేవాల‌య‌ల్లో షాపుల కేటాయింపుపై నిషేదం విధిస్తూ గ‌తంలో ఏపీ ప్రభుత్వం జీవో  జారీ చేసింది. 


ఏపీ ప్ర‌భుత్వ జీవోను స‌వాలు చేస్తూ ఏపీ హైకోర్టులో క‌ర్నూలులోని శ్రీ బ్ర‌మ‌రాంభ మ‌ల్లిఖార్జున‌స్వామి దేవాల‌యం షాపు య‌జ‌మానులు పిటీష‌న్ దాఖ‌లు చేశారు. షాపు య‌జ‌మానుల పిటీష‌న్ల‌ను 27 సెప్టెంబ‌ర్ 2019న ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.  ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో షాపు య‌జ‌మానులు స‌వాలు చేశారు. ఏపీ హైకోర్టు తీర్పుపై 27 జ‌న‌వ‌రి 2020న  సుప్రీంకోర్టు స్టే విధించింది.  సుప్రీంకోర్టు తీర్పును జ‌గ‌న్ స‌ర్కార్‌ ప‌ట్టించుకోలేదు. జ‌గ‌న్ స‌ర్కార్‌పై కోర్టు ధిక్కార పిటీష‌న్‌ను పిటీష‌న‌ర్  స‌య్య‌ద్ జానీ బాషా దాఖ‌లు చేశారు. షాపు య‌జ‌మానుల‌కు అనుకూలంగా 8 ఫిబ్ర‌వ‌రి 2021న సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. న్యాయ‌మూర్తులు చంద్ర‌చూడ్‌, ఏ. ఎస్ బోపన్న నేతృత్వంలో ధ‌ర్మాస‌నం నేడు విచార‌ణ‌ జరిపింది. గ‌తంలో ఇచ్చిన సుప్రీం తీర్పును అమ‌లు చేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఆదేశాలు జారీ చేసింది. షాపుల కేటాయింపులో మ‌తం అడ్డు కాకూడ‌ద‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం పేర్కొంది. 

Updated Date - 2021-12-18T02:35:13+05:30 IST