Bad news for CNG Car owners: కారు యజమానులపై భారం...సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరల పెంపు

ABN , First Publish Date - 2022-08-03T15:47:49+05:30 IST

కారు యజమానులకు దుర్వార్త(Bad news)....

Bad news for CNG Car owners: కారు యజమానులపై భారం...సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరల పెంపు

ముంబయి(మహారాష్ట్ర): కారు యజమానులకు దుర్వార్త(Bad news). బుధవారం నుంచి కంప్రెస్‌డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్‌జీ)(CNG),పైప్‌డ్ నాచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) ధరలను గణనీయంగా పెంచారు( increased).బుధవారం నుంచి సీఎన్‌జీ(Compressed Natural Gas) కిలోకు 6 రూపాయలు, పీఎన్‌జీ(Piped Natural Gas) కిలో ధర 4రూపాయలు చొప్పున పెంచుతున్నట్లు ముంబయి నగర గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ మహానగర గ్యాస్ కంపెనీ( city gas distributor Mahanagar Gas) ప్రకటించింది.కేవలం నెలరోజుల్లో రెండోసారి సీఎన్‌జీ ధరలు పెంచారు. దీని వల్ల సీఎన్‌జీ కార్ల యజమానులపై(CNG Car owners) అదనపు భారం పడనుంది.


 అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో మన దేశంలో గత కొన్ని వారాలుగా పారిశ్రామిక అవసరాలకు గ్యాస్ సరఫరాను తగ్గించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సీఎన్‌జీ ధరలు ఆరుసార్లు పెంచారు. గ్యాస్ ధరల పెంపు వల్ల సీఎన్‌జీ కిలోకు 86 రూపాయలు, పీఎన్‌జీ కిలో ధర 52.50రూపాయలకు పెంచుతున్నట్లు మహానగర గ్యాస్ కంపెనీ తెలిపింది. జులై 12వతేదీన  సీఎన్‌జీ,పీఎన్‌జీ ధరలు పెంచారు. దిగుమతి చేసుకున్న నాచురల్ గ్యాస్ ధరలను కేంద్రం పెంచడంతో పాటు వ్యాట్ వల్ల గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది. 


Updated Date - 2022-08-03T15:47:49+05:30 IST