Adani Stocksలో పెట్టుబడి పెట్టిన వాళ్లకు బ్యాడ్ న్యూస్..

ABN , First Publish Date - 2022-08-23T20:08:00+05:30 IST

ఇండియన్ బిలియనీర్ గౌతమ్ అదానీ(Gowtham Adani) పోర్ట్స్-టు-పవర్ గ్రూప్(Ports - Power Group) ఇప్పటికే ఉన్న, కొత్త వ్యాపారాలలో

Adani Stocksలో పెట్టుబడి పెట్టిన వాళ్లకు బ్యాడ్ న్యూస్..

Adani Stocks : ఇండియన్ బిలియనీర్ గౌతమ్ అదానీ(Gowtham Adani) పోర్ట్స్-టు-పవర్ గ్రూప్(Ports - Power Group) ఇప్పటికే ఉన్న, కొత్త వ్యాపారాలలో దూకుడుగా పెట్టుబడి పెడుతోంది. ప్రధానంగా రుణాలు తీసుకొచ్చి మరీ నిధులు సమకూరుస్తోందని Fitch గ్రూప్ యూనిట్ క్రెడిట్ సైట్స్(CreditSights, a Fitch Group unit) ఒక నివేదికలో తెలిపింది. అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ అనుతన సామ్రాజ్యాన్ని విస్తరించడంతో ప్రదర్శిస్తున్న దూకుడు, దాని క్రెడిట్ కొలమానాలు, క్యాష్ ఫ్లో(credit metrics and cash flow)పై ఒత్తిడికి కారణమవుతున్నాయని క్రెడిట్‌ సైట్స్ మంగళవారం నివేదికలో పేర్కొంది. ఒకవేళ ఇదే కొనసాగితే మాత్రం.. పరిస్థితి చేజారిపోయి మున్ముందు ఇది అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉందని తెలిపింది.  


అయితే ఈ నివేదికపై స్పందన కోరగా.. అదానీ గ్రూప్ ప్రతినిధి స్పందించలేదని క్రెడిట్ సైట్స్ వెల్లడించింది. మొత్తం ఏడు లిస్టెడ్ అదానీ సంస్థలు(7 Listed Adani Groups) మంగళవారం ట్రేడింగ్‌లో 2% నుంచి 7% వరకు పడిపోయాయి. విమానాశ్రయాలు(airports), డేటా సెంటర్లు(Data Centers), సిమెంట్‌(Cement), గ్రీన్ ఎనర్జీ(Green Energy), ఓడరేవులు(Ports), బొగ్గు తవ్వకాల వరకూ తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్న అదానీకి కొన్ని సంవత్సరాల తర్వాత క్రెడిట్‌ సైట్స్ నివేదిక వచ్చింది. ఈ బృందం ఇటీవల $70 బిలియన్లను పునరుత్పాదక ప్రాజెక్టులలో పెడతామని వెల్లడించింది. ఈ అంశాలన్నీ భారతదేశంలో అదానీ స్థాయిని పెంచడమే కాకుండా, ఆయన సంపద ఈ సంవత్సరం $135 బిలియన్లకు పైగా పెరగడానికి దోహదపడ్డాయి. క్రెడిట్‌ సైట్స్ విశ్లేషకులు మరో మాట కూడా చెబుతున్నారు. బ్యాంకులతో గ్రూప్‌‌నకు ఉన్న బలమైన సంబంధాలు.. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ప్రభుత్వం కారణంగా కాస్తంత ఆయన ఊరట పొందుతున్నారని వెల్లడించారు. 


క్రెడిట్‌ సైట్స్ నివేదికలోని కొన్ని ఇతర ముఖ్యాంశాలు :


అదానీ గ్రూప్ కొత్త, సంబంధం లేని వ్యాపారాలలోకి ప్రవేశిస్తోంది. ఇవి అధిక మూలధనాన్ని కలిగి ఉండటంతో పాటు.. అమలు, పర్యవేక్షణకు సంబంధించిన ఇబ్బందులున్న వ్యాపారాల్లోకి అడుగు పెడుతోంది. మార్కెట్ ఆధిపత్యాన్ని సాధించడానికి గ్రూప్, అంబానీ రిలయన్స్ మధ్య నెలకొన్న బలమైన పోటీ.. అర్ధం లేని నిర్ణయాలకు దారి తీయవచ్చు. అయితే.. గ్రూప్ దాని ఫ్లాగ్‌షిప్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ద్వారా తాను చేపట్టిన ప్రాజెక్టులను బలమైన, స్థిరమైన కంపెనీలుగా మార్చడంలో బలమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది. అదానీ.. మోదీ ప్రభుత్వంతో బలమైన సంబంధాన్ని కలిగి ఉన్నారు. అంతేకాకుండా పాలసీ టెయిల్‌విండ్స్ నుంచి లబ్ది పొందారు.


కమొడిటీ ట్రేడర్‌గా ప్రస్థానం..


1980లో కమొడిటీ ట్రేడర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన గౌతమ్‌ అదానీ.. రెండు దశాబ్దాల వ్యవధిలోనే గనులు, ఓడరేవులు విద్యుత్‌ ప్లాంట్లు, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, సిటీ గ్యాస్‌, రక్షణ లాంటి పలు రంగాల వ్యాపారాలు నిర్వహించే ఓ దిగ్గజ వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన సంపాదన ఓ ఆంగ్ల పత్రిక నివేదిక ప్రకారం.. గంటకు రూ. 83.4 కోట్లు. రోజుకు రూ.1000 కోట్లు. ఆయన ఆదాయం సంవత్సరానికి 1.8 లక్షల కోట్లు పొందుతున్నారు. అదానీ నెలవారీ ఆదాయం రూ.15,000 కోట్లు. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో బిల్ గేట్స్‌ను అధిగమించి అదానీ నాలుగో స్థానంలో నిలిచారు.



Updated Date - 2022-08-23T20:08:00+05:30 IST