నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వెంటనే ఈ చిట్కాలు పాటించండి!

ABN , First Publish Date - 2022-02-24T17:13:59+05:30 IST

కొందరికి నోటి దుర్వాసన చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అయితే ఈ సమస్యను కొన్ని చిట్కాలతో అధిగమించవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే...

నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వెంటనే ఈ చిట్కాలు పాటించండి!

ఆంధ్రజ్యోతి(24-02-2022)

కొందరికి నోటి దుర్వాసన చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అయితే ఈ సమస్యను కొన్ని చిట్కాలతో అధిగమించవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే...

దంత సమస్యలు నోటి దుర్వాసనకు కారణమవుతాయి. కాబట్టి ముందుగా దంత వైద్యుణ్ణి కలిసి సమస్యలు ఏవైనా ఉన్నాయా చెక్‌ చేయించుకోవాలి.   

నోట్లో లవంగం వేసుకుని నములుతూ ఉండటం ద్వారా నోటి దుర్వాసనకు చెక్‌ పెట్టవచ్చు. 

నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉన్న వారిలో నోటి దుర్వాసన ఉంటుంది. నీళ్లు నోట్లో ఉన్న బ్యాక్టీరియాను దూరం చేస్తాయి. కాబట్టి తరచుగా నీళ్లు సిప్‌ చేస్తూనే ఉండాలి. 

తేనె, దాల్చిన చెక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలుంటాయి. ఇవి నోట్లో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి. దాల్చినచెక్కను పొడిగా చేసి, తేనె కలిపి దంతాలు, చిగుళ్లపై రాయడం వల్ల ఫలితం ఉంటుంది. 

ఉప్పు నీటిని పుక్కిలించడం ద్వారా కూడా నోటి దుర్వాసనను అరికట్టుకోవచ్చు. చెడు బ్యాక్టీరియాను ఈ చిట్కా అరికడుతుంది.

Updated Date - 2022-02-24T17:13:59+05:30 IST