భద్రకాళి మాడవీధులకు రూ.20 కోట్లు

ABN , First Publish Date - 2022-10-04T06:22:39+05:30 IST

భద్రకాళి మాడవీధులకు రూ.20 కోట్లు

భద్రకాళి మాడవీధులకు రూ.20 కోట్లు

నూతన శోభ సంతరించుకోనున్న ఆలయం

హనుమకొండ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) :  హనుమకొండలోని భద్రకాళి దేవాలయం చుట్టూర మాడవీధుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లను మంజూరు చేసింది. సోమవారం ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ కె రామక్రిష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ తీసుకున్న చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయి. వినయ్‌ భాస్కర్‌  అభ్యర్ధన మేరకు భద్రకాళి గుడి చుట్టూరా వాహనసేవ రథాలు తిరిగేందుకు వీలుగా రూ. 30 కోట్లతో మాడవీధుల నిర్మాణానికి కొద్ది రోజుల క్రితం జిల్లా దేవాదాయ శాఖ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపింది. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రానున్న శాకంబరీ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఆలయం చుట్టూర మాడవీధుల నిర్మాణానికి ప్రత్యేక అభివృద్ధి నిఽధి (ఎస్‌డీఎఫ్‌) నుంచి రూ. 20 కోట్లను మంజూరు చేసింది. దేవాదాయశాఖ సహకారంతో మాడవీఽధుల నిర్మాణం పర్యవేక్షణ బాధ్యతను కలెక్టర్‌కు అప్పగించింది. మాడవీధి నిర్మాణంతో శాకాంబరీ, దేవీశరన్నవరాత్రి, భద్రకాళి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు వాహన సేవలను నిర్వహించడంలో ఆలయ సిబ్బంది, పాల్గొనే భక్తులకు కలుగుతున్న ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోతాయి. మాడవీధుల నిర్మాణం ఆవశ్యకత గురించి ‘ఆంధ్రజ్యోతి’ రాసిన వరుస కథనాలు ఎట్టకేలకు ఫలించాయి. 

 


Updated Date - 2022-10-04T06:22:39+05:30 IST