గంట గంటకు పెరుగుతున్న గోదావరి ఉధృతి.. 36 ఏళ్ల తర్వాత...

ABN , First Publish Date - 2022-07-15T04:29:11+05:30 IST

గోదావరి ఉధృతి దగ్గర గంట గంటకూ పెరుగుతోంది. భారీగా వచ్చి చేరుతున్న వరద ప్రవాహంతో గోదావరి నీటిమట్టం 63.20 అడుగులకు...

గంట గంటకు పెరుగుతున్న గోదావరి ఉధృతి.. 36 ఏళ్ల తర్వాత...

భద్రాచలం: గోదావరి ఉధృతి దగ్గర గంట గంటకూ పెరుగుతోంది. భారీగా వచ్చి చేరుతున్న వరద ప్రవాహంతో గోదావరి నీటిమట్టం 63.20 అడుగులకు చేరింది. శుక్రవారం గోదావరి నీటిమట్టం 70 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక భద్రాచలం దగ్గర గోదావరి వంతెనపై రాకపోకలు బంద్ అయ్యాయి. దాదాపు 36 ఏళ్ల తర్వాత ఈ వంతెనపై రాకపోకలను నిలిపిశారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీకి పూర్తిగా రాకపోకలు నిలిచాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు .. భద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్య 144 సెక్షన్ విధించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. 


Updated Date - 2022-07-15T04:29:11+05:30 IST