బడుగుల ఆశాజ్యోతి ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-01-19T05:18:36+05:30 IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు 26వ వర్థంతి కార్యక్రమాన్ని కందుకూరు ని యోజకవర్గంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

బడుగుల ఆశాజ్యోతి ఎన్టీఆర్‌
దర్శిలో ఎన్టీఆర్‌, శ్రీరాములు విగ్రహాల వద్ద నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు

పలువురు నివాళి 

 పలుచోట్ల అన్నదానం, రక్తదాన శిబిరాలు

కందుకూరు, జనవరి 18: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు 26వ వర్థంతి కార్యక్రమాన్ని కందుకూరు ని యోజకవర్గంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కందుకూరు పట్ట ణంలో  మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌ తదితరులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. అనంతరం ఏరియా హాస్పటల్‌ సెంటర్‌ నుండి వెంగమాంబ ఫంక్షన్‌ హాలు వరకు పెద్దఎత్తున బాణసంచా కాలుస్తూ ర్యాలీ నిర్వహిం చారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు  తది తరులు పాల్గొన్నారు. అనంతరం వేలాదిమందికి అన్నదాన కార్యక్రమం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో పెద్దసం ఖ్యలో యువకులు, విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు.  పాలూరు దొం డపాడులో జరిగిన కార్యక్రమంలో ఇంటూరి రాజేష్‌, గట్టమనేని చెంచు రామయ్య, కంచర్ల శ్రీకాంత్‌ చౌదరి, ఇంటూరి నాగేశ్వరరావు, పిడికిటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ముండ్లమూరు: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ అన్నారు.  మంగళవారం స్వర్గీయ ఎన్‌టీఆర్‌ 26వ వర్ధంతి సందర్భంగా మండలంలోని పసుపుగల్లు, సింగనపాలెం, పెద ఉల్లగల్లు గ్రామాల్లో ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. పసుపుగల్లులో రూ.2.50 లక్షలతో నిర్మించిన ఎన్‌టీఆర్‌ సుజలం ఆర్‌వో ప్లాంట్‌ను ప్రారంభించారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, మాజీ జడ్పీటీసీలు కొక్కెర నాగరాజు, వరగాని పౌలు,  మేదరమెట్ల వెంకటరావు,  ఇందూరి పిచ్చిరెడ్డి, బద్రి గోపాలరెడ్డి, కూరపాటి శ్రీనివాసరావు, సర్పం చ్‌ నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే, మండ లంలోని అన్నిగ్రామాల్లో ఎన్‌టీఆర్‌ చిత్రపటాలకు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 

దర్శి: టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ వర్ధంతిని మంగళవారం మం డలంలో ఘనంగా నిర్వహించారు. వాడవాడలా అన్నదాన కార్యక్ర మాలు నిర్వహించారు. టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన ్‌చార్జ్‌ పమిడి రమేష్‌, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు నగరపంచాయతీ చైర్మ న్‌ నారపుశెట్టి పిచ్చయ్య తదితరులు దర్శి గడియార స్తంభం సెంట ర్‌లోని ఎన్టీఆర్‌, దివంగత మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే, మండలంలోని గ్రామా ల్లో జరిగిన కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు పాల్గొ న్నారు. స్థానిక సాయిబాబా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేశారు. బీసీ సంఘం కార్యాలయంలో  ఎన్టీఆర్‌ వర్ధంతిని నిర్వహించారు.

దొనకొండ: టీడీపీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు నేతృత్వంలో పలుగ్రామాల్లో ఎన్టీఆర్‌ వర్ధంతిని నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్ర హాలకు, చిత్రపటాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు.  కార్యక్ర మాల్లో మాజీ ఏఎంసీ డైరెక్టర్‌ దుగ్గెంపూడి చెంచయ్య, వెంకటాపురం సర్పం చ్‌ తోటా చెన్నమ్మ, బండ్లా వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కురిచేడు: మండలంలో పలుగ్రామాల్లో జరిగిన ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు పూలమాలలువేసిన నివాళులర్పించారు. ప లుచోట్ల అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల  కన్వీనర్‌ నెమిలయ్య, మొఘల్‌ మస్తాన్‌వలి, కిలారి కొండయ్య, కాట్రాజు నాగరాజు, మేరువ పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

తాళ్లూరు: మండలంలోని పలుగ్రామాల్లో ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్ర హాలకు టీడీపీ నాయకలు పూలమాలలువేసి నివాళు లర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శాగం కొండారెడ్డి , మానం రమేష్‌ బాబు, వల్లభనేని సుబ్బ య్య,  షేక్‌ పెదకాలేషావళి తదితరులు పాల్గొన్నారు.

గుడ్లూరు: మండలంలోని పలుగ్రామాల్లో ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. గుడ్లూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ఇంటూరి రాజేష్‌, ఇంటూరి నాగేశ్వరరావు, జనిగర్ల నాగరాజు, చెన్నారెడ్డి మహేష్‌ తదితరులు పూలమాలలువేసి నివాళులర్పించారు. 

లింగసముద్రం: మండలంలో ఎన్టీఆర్‌ వర్ధంతిని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పలుగ్రామాల్లో ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలువేసి నివాళు లర్పించారు.  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ఇంటూరి రాజేష్‌, ఇంటూరి నాగేశ్వరరావు,  నాయబ్‌ రసూల్‌ తదితరులు పాల్గొన్నారు. 

వలేటివారిపాలెం:  మండలంలో జరిగిన ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమం లో టీడీపీ నాయకులు మాదాల లక్ష్మీనరసింహం, ఘటమనేని చెంచురా మయ్య, ఘటమనేని సుబ్బారావు, వలేటి శ్రీదర్‌నాయుడు తదితరులు పా ల్గొన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.  అత్తిం టివారిపాలెం, శింగమనేనిపల్లె గ్రామాలలో జరిగిన కార్యక్రమాల్లో అత్తోటి విజయసారది, నవ్వులూరి మధుబాబు, ఇంటూరి రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌

కనిగిరి, జనవరి 18:  తెలుగువారు ఆరాధ్యదైవంగా కొలిచే మహోన్నత వ్యక్తి ఎన్‌టీఆర్‌ అని టీడీపీ మండల, నగర పంచాయతీ అధ్యక్షులు నం బుల వెంకటేశ్వర్లు, తమ్మినేని శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. ఎన్‌టీఆర్‌  వ ర్ధంతి సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలోని వివిధ మండలాలతో పాటు కనిగిరి పట్టణంలో ఎన్‌టీఆర్‌కు టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఘననివాళులర్పించారు. కనిగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎన్‌టీఆర్‌ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్ట ణంలోని పామూరు బస్టాండ్‌ సెంటర్‌ వద్ద ఉన్న ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొడ్డా వెంకటసు బ్బారెడ్డి, ఫిరోజ్‌, జంషీర్‌ అహ్మద్‌, శ్రీరామ్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

పామూరు: ఆంధ్రుల ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్‌టీఆర్‌ అని టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ బొల్లా మాల్యాద్రిచౌదరి, ఎం.హుస్సేన్‌రావు యాదవ్‌ పేర్కొన్నారు. మండలంలో ఎన్‌టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పలుగ్రామాల్లో ఆయన వి గ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు.  పామూరు, బొట్లగూ డూ రులోని ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు పండ్లు, రొట్టెలు అందచేశారు.  

వెలిగండ: మండలంలో జరిగిన ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ నాయకులు  ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, కర్నాటి భాస్కర్‌రెడ్డి, మీనిగ కాశయ్య తదితరులు పాల్గొన్నారు. 

సీఎస్‌పురం: మండలంలో ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎన్‌టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీరాం పద్మావతి, ఉప సర్పంచ్‌ పాములపాటి నరసయ్య,  జె.లక్ష్మీదేవి, పఠాన్‌ నాయబ్‌రసూల్‌  తదితరులు పాల్గొన్నారు. 

ఉలవపాడు: మండలంలోని పలుగ్రామాల్లో ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ఇంటూరి రాజేష్‌,  ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T05:18:36+05:30 IST