బాదుతూనే ఉంటారు..జాగ్రత్త!

ABN , First Publish Date - 2022-05-18T05:24:28+05:30 IST

ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి బాదుతున్న జగన్‌, మరో అవకాశం ఇస్తే జీవితాంతం బాదు తూనే ఉంటాడని రాజంపేట పార్లమెంట్‌ టీ డీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ్‌, మైనారిటీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఏ మస్తాన్‌ విమర్శించారు.

బాదుతూనే ఉంటారు..జాగ్రత్త!
మదనపల్లె: బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ నేతలు

‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో టీడీపీ  నేతలు

మదనపల్లె టౌన్‌, మే 17: ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి బాదుతున్న జగన్‌, మరో అవకాశం ఇస్తే జీవితాంతం బాదు తూనే ఉంటాడని రాజంపేట పార్లమెంట్‌ టీ డీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ్‌,  మైనారిటీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఏ మస్తాన్‌ విమర్శించారు. మంగళవారం  నక్కలదిన్నె తాండాలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు భవానిప్రసాద్‌ మాట్లా డుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పట్టణంలోని 35 వార్డుల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తామ న్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే బుద్ధిచెప్పాలని కోరారు. వార్డు అధ్యక్షులు రవినాయక్‌, చంద్రానాయక్‌,  నాయకులు ఎస్‌ఎం రఫి, ఎం.రెడ్డిశేఖర్‌, పఠాన్‌ ఖాద ర్‌ఖాన్‌, రాణా, సి.నరసింహులు, ఎస్‌. సుధాకర్‌, అన్వర్‌బాషా, చంద్ర శేఖర్‌, కాశీ శ్రీరామ్‌, విజయమ్మ, తదితరులు పాల్గొన్నారు

పెద్దమండ్యం : విద్యుత్తు, బస్సు చార్జీలు, పెట్రో ల్‌, డీజల్‌ల ధరల పెంపు తో ప్రభుత్వం పేదలను బాదుతోందని తంబళ్లపల్లి టీడీపీ ఇన్‌చార్జ్‌ శంకర్‌ యాదవ్‌ విమర్శించారు.  పెద్ద మండ్యం మండలం వెలిగల్లులో మంగళవారం  బాదుడేబాదుడు కార్యక్రమంలో ఆయన  ప్రజలకు కరపత్రాలు పంచారు. మండల టీడీపీ కన్వీనర్‌ వెంకట రమణ, వెలిగల్లు గ్రామ కమిటీ అధ్యక్షుడు రామాంజులు, రామాం జులు నాయుడు, సాంబశివ, నార శ్రీనివాసులు, గంగాధర, బాను యాదవ్‌, ఓబులేసు, మనోహర్‌ నాయక్‌, బిక్కా మధుకర, పెద్దన్న, సుబ్బిరామిరెడ్డి,, ఎం. శ్రీనివాసులు, రసూల్‌, బాబ్‌జాన్‌, మహేష్‌ తదితరులు 

Updated Date - 2022-05-18T05:24:28+05:30 IST