ముగిసిన బద్వేల్ ఉప ఎన్నిక

Published: Sat, 30 Oct 2021 10:26:12 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ముగిసిన బద్వేల్ ఉప ఎన్నిక

కడప: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఈ సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 281 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోంచుకున్నారు. ఈ ఉపఎన్నిక పోరులో మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పోలింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌తోపాటు వెబ్‌క్యాస్టింగ్‌ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె. విజయానంద్‌ వెల్లడించారు.


బద్వేలు ఉప ఎన్నికకు 3 వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 221 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.