Badvel: ఉప ఎన్నికలో వైసీపీ పన్నాగాలు..

ABN , First Publish Date - 2021-10-30T17:53:28+05:30 IST

బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ పన్నాగలకు అంతు లేకుండా పోతుంది. పలుచోట్ల బయటవారిని రప్పించి దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బద్వేల్

Badvel: ఉప ఎన్నికలో వైసీపీ పన్నాగాలు..

కడప: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ పన్నాగలకు అంతు లేకుండా పోతుంది. పలుచోట్ల బయటవారిని రప్పించి దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూరి మండలం ఎస్. వెంకటాపురంలో బయట నుంచి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తులను స్థానికులు పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానికేతరులను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దుర్భాషలాడుతూ ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు.

Updated Date - 2021-10-30T17:53:28+05:30 IST