బద్వేలు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

Sep 28 2021 @ 11:11AM

కడప : కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేశారు. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8 కాగా.. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్, నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా.. కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య గత వేసవిలో మరణించడం తెలిసిందే. ఆయన మృతితో బద్వేలు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. బద్వేల్ ఉపఎన్నికతో పాటే తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా జరగనుంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.