భక్తురాలికి బ్యాగు అందజేత

ABN , First Publish Date - 2022-09-28T06:06:59+05:30 IST

పోగొట్టుకున్న బ్యాగును భక్తురాలికి శ్రీకాళహస్తి ఆలయ సిబ్బంది అంజేశారు. కర్ణాటకకు చెందిన ఓ భక్తురాలు దర్శనానికి వచ్చింది.

భక్తురాలికి బ్యాగు అందజేత
బ్యాగును అందజేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది

శ్రీకాళహస్తి,సెప్టెంబరు 27: పోగొట్టుకున్న బ్యాగును భక్తురాలికి శ్రీకాళహస్తి ఆలయ సిబ్బంది అంజేశారు. కర్ణాటకకు చెందిన ఓ భక్తురాలు దర్శనానికి వచ్చింది. దర్శన అనంతరం ఆలయ ఆవరణంలోని పొగడ  చెట్టు వద్ద తన హ్యాండ్‌బ్యాగును మరచిపోయింది. కొద్ది సేపటి తరువాత సెక్యూరిటీ గార్డు రవి దానిని గుర్తించాడు. ఎస్పీఎఫ్‌ సిబ్బందికి అందజేశాడు. వారు ఆరా తీసి ఆ భక్తురాలికి అందజేశారు. అందులో రూ.6,120 నగదు ఉంది. ఆ భక్తురాలు వారికి కృతజ్ఞతలు తెలిపింది. 

Updated Date - 2022-09-28T06:06:59+05:30 IST