Advertisement

వేగంగా మిషన్‌ భగీరథ పనులు

May 4 2021 @ 22:19PM
హిల్స్‌ కాలనీలో పైప్‌లైన్‌ నిర్మాణ పనులు

పాల్వంచ టౌన్‌, మే 4: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు వేగం పుంజుకున్నాయి. నత్తనడకన సాగుతున్న పనులపై ఇటీవల ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్‌ మాసాంతానికి పనులు పూర్తిచేసి పట్టణ పరిధి చివరికంటూ మంచినీరందించాలని ఆదేశిం చారు. దాంతో పనులు కొంత మేర ఊపందుకున్నాయి. రూ.50కోట్ల వ్యయంతో మునిసిపల్‌ పరిధిలో ఏడు ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణంతోపాటు 150కిలో మీటర్ల పైపులైన్‌ నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే దానిలో 35 శాతం సుమారు 50 కిలో మీటర్ల పైగా పైపులైన్‌ నిర్మాణంతోపాటు మూడు ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణం పాత పాల్వంచ పాత మునిసిపల్‌ కార్యాలయం వద్ద ట్యాంక్‌ కలెక్టరేట్‌పైన ట్యాంక్‌ వెంగళరావుకాలనీ వద్ద ఈ మూడు ట్యాం కులు మరో కొద్ది కాలంలో పూర్తి దశకు చేరుకున్నాయి. మిగతావి 4లో ఒకటి ఇందిరా కాలనీ, శ్రీనివాసకాలనీ, ముర్రేడువాగు ఒడ్డు, శేఖరం బంజర, కరకవాగులో నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే భగీరథ పనులను ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో గుత్తేదారుకు బిల్‌ పెట్టినా ఇంకా నిధులు విడుదల కానట్లు సమాచారం. నిధులు ఒక సమస్య అయితే... లాక్‌ డౌన్‌ కారణంగా కార్మికుల కొరత కూడా పనులు జాప్యం కావడానికి ఓ కారణంగా తెలుస్తోంది. పనులు త్వరితగతిన పూర్తిచేయడానికి భగీరథ డీఈ నవీన్‌తోపాటు మునిసిపల్‌ కమిషనర్‌ చింత శ్రీకాంత్‌, డీఈ మురళీ, ఏఈ కే. రాజేష్‌ సమన్వయంతో కృషి చేస్తున్నారు. 


Follow Us on:
Advertisement