Multiple Entry Visa: బహ్రెయిన్ కీలక నిర్ణయం.. వారికి ఉచితంగా వీసాలు!

ABN , First Publish Date - 2022-03-22T17:27:35+05:30 IST

బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ మల్టీపుల్ ఎంట్రీ వీసాలపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

Multiple Entry Visa: బహ్రెయిన్ కీలక నిర్ణయం.. వారికి ఉచితంగా వీసాలు!

మనామా: బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ మల్టీపుల్ ఎంట్రీ వీసాలపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కింగ్ ఫహద్ కాజ్‌వే ద్వారా ప్రయాణించి బహ్రెయిన్ వచ్చే వ్యాపారవేత్తలు, ట్రేడర్లు, ఇన్వెస్టర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు పూర్తి ఉచితంగా మల్టీపుల్ ఎంట్రీ వీసాలు అందజేయనున్నట్లు ప్రకటించింది. అంతర్గత మంత్రిత్వశాఖ మంత్రి జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా మాట్లాడుతూ, ఎవరైతే జీసీసీ దేశాల్లోని ఏదో ఒక కంట్రీకి సంబంధించిన చెల్లుబాటయ్యే ఎంట్రీ వీసాను కలిగి ఉంటారో వారు కొత్త వీసా పొందేందుకు అర్హులను తెలిపారు. కాగా, ఫ్రీ వీసా హోల్డర్లు తప్పనిసరిగా కింగ్‌డమ్‌లో 30 రోజుల పాటు స్టే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే మల్టీపుల్ ఎంట్రీ వీసాలు కలిగిన వ్యాపారవేత్తలు, ట్రేడర్లు, ఇన్వెస్టర్ల వద్ద పనిచేసే వర్కర్లు కూడా ఈ వీసాలను పొందే అవకాశం కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. 

Updated Date - 2022-03-22T17:27:35+05:30 IST