Bahrain: కరోనా ఆంక్షలు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-02-12T13:41:08+05:30 IST

గల్ఫ్ దేశం బహ్రెయిన్ తీపి కబురు చెప్పింది. ఈ నెల 15వ తేదీ నుంచి కరోనా ఆంక్షలన్నింటినీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

Bahrain: కరోనా ఆంక్షలు ఎత్తివేత

మనామా: గల్ఫ్ దేశం బహ్రెయిన్ తీపి కబురు చెప్పింది. ఈ నెల 15వ తేదీ నుంచి కరోనా ఆంక్షలన్నింటినీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై యధావిధిగా అన్ని కార్యక్రమాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా నిర్వహించుకోవచ్చని కోవిడ్-19తో పోరు కోసం ఏర్పాటైన మెడికల్ టాస్క్‌ఫోర్స్ శుక్రవారం వెల్లడించింది. వ్యాక్సిన్ వేసుకున్నవారితో పాటు తీసుకోని వారికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. కేఫ్స్, రెస్టారెంట్స్, స్పోర్ట్స్ సెంటర్స్, షాపింగ్ మాల్స్ అన్ని కూడా పూర్తి సామర్థ్యంతో నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న మసీదులు సైతం ఇకపై పూర్తి సామర్థ్యంతో నడుస్తాయని తెలిపింది. అయితే, బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్కు ధరించడం ఒక్కటి మాత్రం తప్పనిసరిగా పాటించాలని తెలియజేసింది. బహ్రెయిన్ వ్యాప్తంగా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెడికల్ టాస్క్‌ఫోర్స్ పేర్కొంది.  

Updated Date - 2022-02-12T13:41:08+05:30 IST