అరబ్ దేశాల్లో Happiest Country ఏదంటే..?

ABN , First Publish Date - 2022-03-20T15:34:24+05:30 IST

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 146 దేశాల్లో జరిపిన అధ్యయనం ఆధారంగా ‘ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

అరబ్ దేశాల్లో Happiest Country ఏదంటే..?

మనామా: ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 146 దేశాల్లో జరిపిన అధ్యయనం ఆధారంగా ‘ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ నివేదిక ఆధారంగా ప్రపంచలోనే అత్యంత ఆనందకరమైన దేశంగా ఫిన్లాండ్ నిలిచింది. ఇలా టాప్ ప్లేస్‌లో నిలవడం ఫిన్లాండ్‌కు వరుసగా ఇది ఐదోసారి కావడం విశేషం. ఫిన్లాండ్ తర్వాత డెన్మార్క్, ఐస్‌ల్యాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ వరుసగా టాప్-5లో నిలిచాయి. ఇక అరబ్ దేశాల విషయానికి వస్తే.. బహ్రెయిన్‌కు మొదటి స్థానం దక్కింది. గతేడాది మూడో ర్యాంకులో ఉన్న బహ్రెయిన్ ఈ ఏడాది మొదటి స్థానానికి ఎగబాకింది. మొత్తం 146 దేశాల జాబితాలో బహ్రెయిన్ 21వ స్థానంలో నిలిచింది. బహ్రెయిన్ తర్వాత రెండో స్థానంలో యూఏఈ(గ్లోబల్లీ-24), మూడో స్థానంలో సౌదీ అరేబియా(గ్లోబల్లీ-25), నాల్గో స్థానంలో కువైత్(గ్లోబల్లీ-50) నిలిచాయి. కాగా.. ఒమన్, ఖతార్‌కు ఈ జాబితాలో చోటు దక్కలేదు. ఇకపోతే భారత్ మొత్తం 146 దేశాల్లో 136 ర్యాంకుతో సరిపెట్టుకుంది. పౌరుల సంతోషం, ఆదాయం, ఆరోగ్యం, సామాజిక అంశాలు వంటి వాటిని పరిశీలించి ఈ నివేదికను రూపొందించడం జరుగుతుంది.  


Updated Date - 2022-03-20T15:34:24+05:30 IST