మళ్ళీ జనంలోకి ‘బాహుబలి’

ABN , First Publish Date - 2022-04-30T14:35:37+05:30 IST

ఏడాది తర్వాత అడవి నుంచి ‘బాహుబలి’ అనే అడవి ఏనుగు మళ్లీ జననివాస ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. గత యేడాది జూన్‌లో ఈ

మళ్ళీ జనంలోకి ‘బాహుబలి’

చెన్నై: ఏడాది తర్వాత అడవి నుంచి ‘బాహుబలి’ అనే అడవి ఏనుగు మళ్లీ జననివాస ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. గత యేడాది జూన్‌లో ఈ అడవి ఏనుగు మేట్టుపాళయం, నెల్లిమలై, వెల్‌సపురం, కల్లారు, ఓడతురై, ఊమపాళయం, బాలపట్టి ప్రాంతాల్లో నానాబీభత్సం సృష్టించింది. ఆకారంలో పెద్దదిగా ఉండటంతో ఆ ఏనుగును స్థానికులు ‘బాహుబలి’ అనే పేరుతో పిలిచారు. ఆ ఏనుగు బీభత్సంపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దానిని మత్తు సూదుల ద్వారా నిర్బంధించాలని, కుంకీ ఏనుగుల ద్వారా అడవిలోకి తరిమికొట్టాలని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు ‘బాహుబలి’ హఠాత్తుగా అదృశ్యమైంది. గత 11 నెలలుగా ‘బాహుబలి’ బెడదలేకపోవడంతా గ్రామస్థులు ప్రశాంతంగా జీవించసాగారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ‘బాహుబలి’ ఏనుగు అడవి నుంచి ఊటీ- కొత్తగిరి రహదారిలో ప్రత్యక్షమైది. ఈ విషయం తెలుసుకున్న మేట్టుపాళయం పరిసర గ్రామస్థులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-04-30T14:35:37+05:30 IST