రేపు ‘బహుజన రాజ్యాధికార’ సభ

ABN , First Publish Date - 2022-06-25T05:34:47+05:30 IST

రేపు ‘బహుజన రాజ్యాధికార’ సభ

రేపు ‘బహుజన రాజ్యాధికార’ సభ
మాట్లాడుతున్న బీఎ్‌సపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంచంద్రం

హయాగ్రీవచారి గ్రౌండ్‌లో నిర్వహణ 

 పాల్గొననున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, రాంజీ గౌతమ్‌, ఆకాష్‌ ఆనంద్‌, మంద ప్రభాకర్‌

హనుమకొండ రూరల్‌, జూన్‌ 24: బహుజన రాజ్యాధికార యాత్ర వందరోజుల భారీ బహిరంగ సభను ఈ నెల 26వ తేదీన హనుమకొండ బాలసముద్రంలోని హయాగ్రీవచారి గ్రౌండ్‌లో సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్లు బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సభ ఇన్‌చార్జి నిషాని రాంచంద్రం తెలిపారు. శుక్రవారం  హయగ్రీవాచారి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనగామ జిల్లా ఖిలాషాపూర్‌లో మొదలైన బహుజన రాజ్యాధికార యాత్ర ఆదివారంతో వందరోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాధికార రథసారథి, బీఎ్‌సపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగే సభకు ముఖ్య అతిథులుగా బీఎ్‌సపీ జాతీయ కో ఆర్డినేటర్‌, రాజ్యసభ సభ్యుడు రాంజీగౌతమ్‌, జాతీయ కో ఆర్డినేటర్‌ ఆకాష్‌ ఆనంద్‌, రాష్ట్ర చీఫ్‌ కో ఆర్డినేటర్‌ మంద ప్రభాకర్‌ హాజరవుతున్నట్లు తెలిపారు. 

1300 మంది అమరుల సాక్షిగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కొందరి తెలంగాణగా మారిపోయిందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. సమన్యాయం, సమపాలన, బహుజన రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులు, మేధావులు, స్వేరోలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కవులు, కళాకారులు, ప్రజా, కులసంఘా లు, కార్మికులు, బహుజనులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మంద శ్యాం, విజయ్‌కుమార్‌, బి.సారయ్య, ఎస్‌.రాజు, ఎం.రవికుమార్‌, రవి, కన్నం సునీల్‌, వెంకటస్వామి, రజిత, పుష్ప, రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T05:34:47+05:30 IST